Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs BAN: మిచెల్ స్టార్క్ సిక్సర్..64 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్!

ఆస్ట్రేలియా‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సంచలన విజయంతో శుభారంభం చేసిన బంగ్లాదేశ్.. రెండో టెస్ట్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. మెకాయ్ వేదికగా శనివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. తొలి టెస్ట్ పరాజయంతో పూర్తిగా పేస్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ను ఆస్ట్రేలియా సిద్దం చేయగా.. బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం.. ఆసీస్‌కు బిగ్ షాక్!

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం.. ఆసీస్‌కు బిగ్ షాక్!

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (6/12) ఆరు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్(3/25) మూడు వికెట్లు తీయగా.. జోష్ హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో తాంజిద్ హసన్(0), షాద్‌మన్ ఇస్లాం(0) డకౌట్‌గా వెనుదిరిగారు. మెహ్‌దీ హసన్ మీరాజ్(11), హసన్ మహ్ముద్(10), తైజుల్ ఇస్లామ్(11 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. షోరిఫుల్ ఇస్లామ్(14), తైజుల్ ఇస్లామ్ ఆఖరి వికెట్‌కు 25 పరుగులు జోడించి జట్టు స్కోర్‌ను 64కు చేర్చారు. లేదంటే ఆ జట్టు చెత్త రికార్డ్‌ను మూటగట్టుకునేది.

AUS vs BAN Mitchell Starc Six-Wicket Haul Bundles Bangladesh Out for 64 in 2nd Test against Australia

అనంతరం ఆస్ట్రేలియా 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మ్యాట్ రేన్ షా(8), మార్నల్ లబుషేన్(4), ట్రావిస్ హెడ్(22) తీవ్రంగా నిరాశపర్చగా.. స్టీవ్ స్మిత్(6 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ట్రావిస్ హెడ్ ఎదురుదాడికి దిగడంతో ఆస్ట్రేలియా పరుగులు రాబట్టింది.

తొలి రోజు ఆటలో 41.5 ఓవర్లలోనే 13 వికెట్లు పడ్డాయంటేనే పిచ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా పేస్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌ను తయారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌కు భయపడే ఆస్ట్రేలియా తొండాటకు తెరలేపిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

బంగ్లా చేతిలో ఘోర పరాజయం.. ఆస్ట్రేలియా టీమ్‌లో కీలక మార్పు!

Also Read

బంగ్లా చేతిలో ఘోర పరాజయం.. ఆస్ట్రేలియా టీమ్‌లో కీలక మార్పు!

భారత్‌కు వచ్చినప్పుడు స్పిన్ పిచ్‌లంటూ గగ్గోలు పెట్టే ఆసీస్.. ఇప్పుడు పేస్ పిచ్‌లను ఎందుకు తయారు చేసిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తొలి టెస్ట్ ఓటమితో ఆస్ట్రేలియా భయపడిపోయిందని విమర్శిస్తున్నారు. విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్‌లో పూర్తి పేస్ పిచ్‌ను తయారు చేసిందని ఆరోపిస్తున్నారు.

Story first published: Saturday, August 22, 2026, 10:29 [IST]
Other articles published on Aug 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+