Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా దారికే అడ్డొస్తావా? మిచెల్ స్టార్క్ X మెహ్‌దీ హసన్ డిష్యూం డిష్యూం!(వీడియో)

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, మెహ్‌దీ హసన్ మధ్య వాగ్వాదం జరిగింది. 'నా దారికే అడ్డొస్తావా?'అని వేలు చూపిస్తూ మిచెల్ స్టార్క్.. మెహ్‌దీ హసన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అతను కూడా ధీటుగా బదులివ్వడంతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

AUS vs BAN: శతక్కొట్టిన తంజీద్ హసన్.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్!

AUS vs BAN: శతక్కొట్టిన తంజీద్ హసన్.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్!

అసలేం జరిగిందంటే..?

రెండో రోజు ఆట‌‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ ఆడిన మిరాజ్.. క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే అతను మిచెల్ స్టార్క్‌కు ఎదురుగా పరుగెత్తాడు. అతను అడ్డుగా ఉన్నాడని పక్కకు జరిగి పిచ్ మధ్యలో నుంచి పరుగు పూర్తి చేశాడు. ఇది గమనించిన అంపైర్ మెహ్‌దీ హసన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మిచెల్ స్టార్క్ అడ్డు రావడంతోనే పిచ్ మధ్యలో పరుగెత్తాల్సి వచ్చిందని మెహ్‌దీ హసన్ అంపైర్‌తో అన్నాడు.

Mitchell Starc Loses His Cool at Mehidy Hasan Says Get Off the Wicket as Video Goes Viral

దాంతో తీవ్ర అసహనానికి గురైన మిచెల్ స్టార్క్..'ఇది నా ఫాలో త్రూ.. నీ దారి కాదు. పిచ్‌పై నుంచి తప్పుకో'అని ఘాటుగా బదులిచ్చాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వగా.. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దాంతో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ బ్యాట్లర్ల అద్భుత బ్యాటింగ్‌తో మిచెల్ స్టార్క్ పలుమార్లు సహనం కోల్పోయాడు.

AUS vs BAN: 23 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాను గడగడలాడించిన బంగ్లాదేశ్!

Also Read

AUS vs BAN: 23 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాను గడగడలాడించిన బంగ్లాదేశ్!

పట్టుబిగించిన బంగ్లాదేశ్..

ఈ మ్యాచ్‌‌పై బంగ్లాదేశ్ పట్టు బిగించింది. తంజీద్ హసన్(197 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్లకు 351 పరుగులు చేసింది. నజ్ముల్ హోస్సేన్ షాంటో(126 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 84) తృటిలో శతకం చేజార్చుకోగా.. ముష్ఫికర్ రహీమ్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), మెహ్‌దీ హసన్ మీరాజ్(73 బంతుల్లో 3 ఫోర్లతో 32 బ్యాటింగ్) పర్వాలేదనిపించారు. హసన్ మహముద్(13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/66), జోష్ హేజిల్ వుడ్(2/66) రెండేసి వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో మరో 50 పరుగుల ఆధిక్యం సాధించి..రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను తర్వగా ఆలౌట్ చేస్తే చారిత్రాత్మక విజయం సొంతమవుతుంది.

ఆసీస్ 198 ఆలౌట్..

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహ్ముద్(6/55) ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. టస్కిన్ అహ్మద్(2/55), ఎబాడన్ హోస్సేన్ (2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(109 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 71) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Friday, August 14, 2026, 16:24 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+