Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs BAN: 23 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాను గడగడలాడించిన బంగ్లాదేశ్!

ఆస్ట్రేలియా పర్యటనను బంగ్లాదేశ్ ఘనంగా ప్రారంభించింది. 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తొలి టెస్ట్ ఆడుతున్న బంగ్లాదేశ్.. ఫస్ట్ టెస్ట్ తొలి రోజు ఆతిథ్య జట్టును గడగడలాడించింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌‌లో భాగంగా గురువారం డార్విన్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది.

IND vs SL: భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ఇదే!

IND vs SL: భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ఇదే!

బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహ్ముద్(6/55) ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. టస్కిన్ అహ్మద్(2/55), ఎబాడన్ హోస్సేన్ (2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(109 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 71) హాఫ్ సెంచరీతో రాణించి ఇజ్జత్ కాపాడాడు. ట్రావిస్ హెడ్(22), జాక్ వెదరాల్డ్(23), మార్నస్ లబుషేన్(1), కామెరూన్ గ్రీన్(13), అలెక్స్ క్యారీ(19), బ్యూ వెబ్‌స్టర్(12), పాట్ కమిన్స్(9), మిచెల్ స్టార్క్(1), నాథన్ లయన్(7) తీవ్రంగా నిరాశపర్చారు. ఓవైపు వరుసగా వికెట్లు పడినా స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు.

AUS vs BAN Bangladesh Pacers Put Australia Under Pressure on Historic Test Return After 23 Years

టెస్ట్‌ల్లో బంగ్లాదేశ్‌పై ఆసీస్‌కు ఇదే అత్యల్ప స్కోర్. ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగిన ఆసీస్..ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌తో ఆసీస్ 7 టెస్ట్‌లు ఆడగా.. ఇదే అత్యల్ప స్కోర్. 9 ఏళ్ల క్రితం 2017‌లో మిర్‌పూర్‌లో బంగ్లాదేశ్‌పై ఆసీస్ ఓడిన టెస్ట్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇదే అత్యల్పం కాగా.. తాజా ఇన్నింగ్స్‌ దాన్ని బ్రేక్ చేసింది.

బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. అఫ్గాన్‌తో భారత టీ20 సిరీస్ ఖరారు!

Also Read

బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. అఫ్గాన్‌తో భారత టీ20 సిరీస్ ఖరారు!

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో తంజిద్ హసన్(32 బ్యాటింగ్), మోమినుల్ హక్(35 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ షాదమన్ ఇస్లామ్‌(20)ను మిచెల్ స్టార్క్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 102 పరుగుల వెనుకంజలో ఉంది. మొత్తంగా తొలి రోజు ఆటలో మూడు సెషన్లలో బంగ్లాదేశ్ ఆధిపత్యం చెలాయించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో చాలా మంది ఎడ్జ్‌లతో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు.

Story first published: Thursday, August 13, 2026, 14:59 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+