Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs BAN: కామెరూన్ గ్రీన్ ఒంటరి పోరాటం.. ఆధిక్యంలో ఆసీస్!

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో పేసర్లు రాజ్యమేళడంతో తొలి రోజు ఆటలోనే 18 వికెట్లు పడ్డాయి. కామెరూన్ గ్రీన్(81 బంతుల్లో 8 ఫోర్లతో 51 బ్యాటింగ్) ఒంటరిపోరాటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది.

గ్రీన్‌తో పాటు స్టీవ్ స్మిత్(74 బంతుల్లో 6 ఫోర్లతో 42) రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. స్మిత్ ఔటైనా.. గ్రీన్ పోరాడాడు. ఇతర బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరినా ఓపికగా బ్యాటింగ్ చేసి 80 బంతుల్లో అర్ధశతకాన్నిఅందుకున్నాడు. గ్రీన్‌తో పాటు నాథన్ లయన్(10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.

AUS vs BAN Australia Lead Bangladesh by 101 Runs After 18 Wickets Fall on Day 1 of 2nd Test

ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 101 పరుగులకు చేరింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్(6/35) ఆరు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. ఆసీస్ బ్యాటర్లలో బ్యూ వెబ్‌స్టర్, ప్యాట్ కమిన్స్ డకౌట్ కాగా.. మిచెల్ స్టార్క్(1) అలెక్స్ క్యారీ(5), స్టీవ్ స్మిత్(42), మార్నస్ లబుషేన్(4), మ్యాట్ రేన్‌షా(8) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ట్రావిస్ హెడ్(22) దూకుడుగా ఆడాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (6/12) ఆరు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్(3/25) మూడు వికెట్లు తీయగా.. జోష్ హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.

తొలి టెస్ట్ సెంచరీ హీరో తాంజిద్ హసన్(0), షాద్‌మన్ ఇస్లాం(0) డకౌట్‌గా వెనుదిరిగారు. మెహ్‌దీ హసన్ మీరాజ్(11), హసన్ మహ్ముద్(10), తైజుల్ ఇస్లామ్(11 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. షోరిఫుల్ ఇస్లామ్(14), తైజుల్ ఇస్లామ్ ఆఖరి వికెట్‌కు 25 పరుగులు జోడించి జట్టు స్కోర్‌ను 64కు చేర్చారు. లేదంటే ఆ జట్టు చెత్త రికార్డ్‌ను మూటగట్టుకునేది. పూర్తిగా పేస్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌ను తయారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. తొలి టెస్ట్ పరాజయంతో బంగ్లాదేశ్‌కు భయపడే ఆస్ట్రేలియా తొండాటకు తెరలేపిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Story first published: Saturday, August 22, 2026, 16:19 [IST]
Other articles published on Aug 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+