Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs BAN: తేలిపోయిన ఆసీస్.. విజయం దిశగా బంగ్లాదేశ్!

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ విజయం దిశగా సాగుతోంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. క్రీజులో కామెరూన్ గ్రీన్(43 బ్యాటింగ్)తో పాటు అలెక్స్ క్యారీ(19 నాటౌట్) ఉన్నాడు.

శ్రీలంక ఆటగాడి నెత్తి పగలగొట్టిన కేఎల్ రాహుల్.. ఫ్యాన్స్ ఫిదా!(వీడియో)

శ్రీలంక ఆటగాడి నెత్తి పగలగొట్టిన కేఎల్ రాహుల్.. ఫ్యాన్స్ ఫిదా!(వీడియో)

ట్రావిస్ హెడ్(17), జేక్ వెదరాల్డ్(0) మరోసారి విఫలమవ్వగా.. మార్నస్ లబుషేన్(31), స్టీవ్ స్మిత్(44) కీలక భాగస్వామ్యాన్ని అందించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్ముద్(2/33) రెండు వికెట్లు తీయగా.. తైజుల్ ఇస్లామ్, మెహ్‌ది హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.

AUS vs BAN 1st Test Australia Struggle at 161 4 Bangladesh Closing in on Historic Win

బంగ్లాకు భారీ ఆధిక్యం..

అంతకుముందు 351/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 138 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ మెహ్‌దీ హసన్(154 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీతో రాణించాడు. తంజీద్ హసన్(197 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో.. నజ్ముల్ హోస్సేన్ షాంటో(126 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 84) హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్(6/89) ఆరు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/79) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్ తలో వికెట్ తీసారు. దాంతో బంగ్లాదేశ్‌కు 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్.. 23 ఏళ్ల రికార్డ్ బద్దలు!

Also Read

ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్.. 23 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఆసీస్ తడబాటు..

భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. అదే తడబాటు కొనసాగించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(17), జేక్ వెదరాల్డ్(0) తీవ్రంగా నిరాశపర్చారు. ఈ క్రమంలో లబుషేన్, స్మిత్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. లబుషేన్‌ను తైజుల్ ఇస్లామ్ ఔట్ చేయగా.. స్మిత్‌ను మెహ్‌దీ హసన్ మిరాజ్ పెవిలియన్ చేర్చి హాఫ్ సెంచరీని అడ్డుకున్నాడు. కామెరూన్ గ్రీన్(43 బ్యాటింగ్), అలెక్స్ క్యారీ(19 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించారు. ఈ ఇద్దరి ప్రదర్శనపైనే ఆసీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ఇద్దరూ సెంచరీలతో చెలరేగి భారీ లక్ష్యం నమోదు చేస్తే తప్పా ఈ మ్యాచ్‌లో ఆసీస్ గట్టెక్కలేదు.

నాలుగో రోజు ఆటలో బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగిన ఆసీస్‌ను త్వరగా ఆలౌట్ చేస్తే బంగ్లాదేశ్ విజయం సులువు అవుతుంది. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 67 పరుగుల వెనుకంజలో ఉంది. లక్ష్యం 200 ధాటకుండా చూసుకుంటే బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధ్యమవుతోంది. ఆసీస్‌పై బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతోంది.

Story first published: Saturday, August 15, 2026, 15:14 [IST]
Other articles published on Aug 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+