Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళా క్రికెటర్లతో మాజీ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

Atul Bedade suspended as Baroda womens coach for alleged misbehaving



వడోదర:
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం బరోడా మహిళల జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న అతుల్‌ బెదాడే తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. తాను కోచ్‌గా వ్యవహరిస్తున్న జట్టు క్రికెటర్లతో అతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. దీంతో బెదాడేను సస్పెండ్‌ చేస్తున్నట్లు బరోడా క్రికెట్‌ సంఘం (బీసీఏ) ప్రకటించింది.

ఈ మేరకు బెదాడేకు లేఖ రాసిన కార్యదర్శి అజిత్‌ లెలె పలు అంశాలు వెల్లడించారు. 'మహిళా క్రికెటర్ల శారీరక విషయాల గురించి, వారి ఆరోగ్య విషయాల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర భాష మాట్లాడటం, లైంగికపరమైన అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేయడంలాంటివి'... బెదాడేపై వచ్చిన ప్రధాన ఆరోపణలని ఆయన చెప్పారు.

క్రికెటర్ల రాతపూర్వక ఫిర్యాదు తర్వాత తాము విచారణ జరపడంతో అనేక విషయాలు బయటపడ్డాయని లెలె తెలిపారు. ప్రస్తుతానికి సస్పెండ్‌ చేసినా... ఈ అంశంపై ఇక ముందు పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కూడా బీసీఏ ప్రకటించింది.

53 ఏళ్ల అతుల్‌ బెదాడే 1994లో భారత్‌ తరఫున 13 వన్డేలు ఆడి 22.57 సగటుతో 158 పరుగులు చేశాడు. బరోడా పురుషుల జట్టు హెడ్ కోచైన బెదాడే..గతేడాదే మహిళల జట్టు బాధ్యతలు తీసుకున్నాడు.

Story first published: Sunday, March 22, 2020, 9:41 [IST]
Other articles published on Mar 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+