కేఎల్ రాహుల్ వర్కౌట్ ఫొటోలపై అతియా శెట్టి హాట్ కామెంట్!

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. అయితే తాజాగా కేఎల్ రాహుల్ పోస్ట్‌లకు అతియా శెట్టి స్పందించడంతో వీరీ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.
ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా అపెండిసైటిస్‌తో బాధపడిన కేఎల్ రాహుల్‌కు శస్త్రిచికిత్స జరిగిన విషయం తెలిసిందే. అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తేలికపాటి కసరత్తులు చేస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు ఫొటోలను అతను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. అయితే ఈ ఫొటోలపై అతియా శెట్టి స్పందించింది. దాంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
కెటిల్ బాల్‌తో తేలికపాటి కసరత్తులు చేస్తున్న చిత్రాన్ని రాహుల్ పోస్ట్ చేశాడు. దాంతో పాటు సేదతీరుతున్న, క్యాండిడ్ చిత్రాలను పెట్టాడు. 'And still, We Rise' అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఎంతో మంది అతడి పోస్ట్‌కు స్పందించినప్పటికీ అతియా శెట్టి పెట్టిన కామెంట్ మాత్రం వైరల్‌గా మారింది. ఆమె మరీ భిన్నంగా ఏం పెట్టలేదు. కేవలం స్మైలీ ఏమోజీనే పెట్టింది.

ఐపీఎల్ 2021 సీజన్ ఆడుతుండగా కేఎల్ రాహుల్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను అపెండిసైటిస్‌తో బాధపడుతున్నాడని తెలింది. ఆ తర్వాత అతను శస్త్రచికిత్స చేయించుకోవడంతో లీగ్‌కు దూరమయ్యాడు. ఇంతలోనే ఇంగ్లండ్ పర్యటనకు సెలక్టర్లు టీమిండియాకు ఎంపిక చేశారు. కోలుకుంటేనే రాహుల్ ఇంగ్లండ్‌కు వెళ్తాడని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టే రాహుల్ ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications