న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ నా పేరు చెప్పడంతో ఏడ్చేశా: శ్రీశాంత్

 At Bigg Boss 12, S Sreesanth recalls incident involving Sachin Tendulkar which made him break into tears

న్యూఢిల్లీ: మాస్టర్‌ బ్లాస్టర్' సచిన్‌ టెండూల్కర్‌కు, తనకు మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్‌బాస్‌' సీజన్‌ 12లో శ్రీశాంత్‌ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సచిన్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని సహచరులతో పంచుకున్నారు.

సందర్భాన్ని వివరిస్తూ క్రికెటర్లందరి పేర్లు

సందర్భాన్ని వివరిస్తూ క్రికెటర్లందరి పేర్లు

‘2011లో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచింది. ఆ తర్వాత ఓసారి మా ఆటగాళ్లంతా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాం. ఆ సమయంలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి టీమిండియా కప్పు గెలిచిన సందర్భాన్ని గొప్పగా వివరిస్తూ క్రికెటర్లందరి పేర్లు చెప్పాడు. కానీ నా పేరు మాత్రం చెప్పలేదు. నేనూ మధ్యలో మాట్లాడలేదు. ఇంటర్వ్యూ ముగిసేవరకూ మౌనంగానే ఉన్నా. చివరి నిమిషం వరకూ ఆ విలేకరి నా పేరును ప్రస్తావించలేదు.' అని ఒకింత నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు.

ఆ వయస్సులో మాకంత నైపుణ్యం లేదు: కోహ్లీ

మాటలు విని చాలాసేపు ఏడ్చా

మాటలు విని చాలాసేపు ఏడ్చా

ఆ కాసేపటి తర్వాత సచిన్‌ కలగజేసుకుని..‘2011 వరల్డ్‌ కప్‌ సమయంలో శ్రీశాంత్‌ కీలక పాత్ర పోషించారు' అని పేర్కొన్నారు. ఆయన మాటలు విని నేను చాలాసేపటి వరకు ఏడ్చాను' అని శ్రీశాంత్‌ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ 12 సీజన్‌లో అత్యధిక ధర పలికిన పోటీదారుడిగా ఎన్నికయ్యాడు. అతనికి నిర్వహకులు వారానికి రూ.50 లక్షల రూపాయలు వెచ్చించి కార్యక్రమంలో ఉండేలా ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం సినిమాలు, రియాల్టీ షోలు

ప్రస్తుతం సినిమాలు, రియాల్టీ షోలు

ఈ సీజన్‌లో శ్రీశాంత్‌ను సీక్రెట్ రూంలో ఉంచిన బిగ్ బాస్ మళ్లీ అతణ్ని అందరితో పాటు పాల్గొనేలా నిబంధన సడలించింది. కొన్నాళ్ల పాటు దాదాపు ఐదేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రీశాంత్‌ ప్రస్తుతం సినిమాలు, రియాల్టీ షోలు చేస్తున్నారు. త్వరలో ‘బిగ్‌ పిక్చర్‌' అనే హిందీ చిత్రంలో కన్పించబోతున్నారు. 2017లో ‘టీం 5' అనే తెలుగు చిత్రంలో శ్రీశాంత్‌ నటించారు.

మరోసారి వారిపై పిటిషన్‌ను దాఖలు

మరోసారి వారిపై పిటిషన్‌ను దాఖలు

2013లో ఐపీఎల్‌ సమయంలో శ్రీశాంత్.. అజిత్ చండీలా, అంకీత్ చావన్‌లతో పాటు స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించింది. ఆ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో 36 మందిపై నిషేదం విధించిన పాట్యాలా హౌస్ కోర్టు జూలై 2015తర్వాత దానిని ఎత్తి వేసింది. కానీ, బీసీసీఐ దానికి సంతృప్తి చెందకపోవడంతో ఈ ఏడాది ఆగష్టులో మరోసారి వారిపై పిటిషన్‌ను దాఖలు చేసింది.

Story first published: Tuesday, October 16, 2018, 14:12 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X