For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వయస్సులో మాకంత నైపుణ్యం లేదు: కోహ్లీ

India vs West Indies: None of us were even 10% of what Prithvi Shaw is when we were 18, 19, says Virat Kohli

న్యూ ఢిల్లీ: యువ ఓపెనర్ పృథ్వీ షాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల్లో ముంచెత్తాడు. తొలి టెస్టు సిరీస్‌లోనే షా అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు. ఏ మాత్రం భయం లేకుండా బరిలో దిగుతున్న ఇలాంటి ఆటగాడు జట్టులో ఉండటం ఆనందంగా ఉందన్నాడు. అశ్రద్ధ వహించకుండా.. ఆత్మవిశ్వాసంతో ఆడాడని యువ ఓపెనర్‌కి కితాబిచ్చాడు. షా దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. నియంత్రణ కోల్పోవడం లేదని విరాట్ తెలిపాడు.

కొత్త బంతిపై నియంత్రణ గొప్ప నైపుణ్యమని..

కొత్త బంతిపై నియంత్రణ గొప్ప నైపుణ్యమని..

ఇంగ్లాండ్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా షా ఇలా ఆడటం చూశానని చెప్పుకొచ్చాడు. కొత్త బంతిపై ఇలాంటి నియంత్రణ ఉండటం గొప్ప నైపుణ్యమని చెప్పిన కోహ్లి.. పృథ్వీ షా నైపుణ్యంలో పదో వంతు కూడా 18, 19 ఏళ్ల వయసులో మాకెవరికీ లేదని చెప్పుకొచ్చాడు. తొలి సిరీస్‌లోనే ఓ ఆటగాడు ఎలాంటి బెరుకు లేకుండా ఆడటం భారత క్రికెట్‌కు శుభ సంకేతమన్నాడు.

ఏ మాత్రం బెరుకు లేకుండా ధైర్యంగా

ఏ మాత్రం బెరుకు లేకుండా ధైర్యంగా

షా, పంత్ ఏ మాత్రం బెరుకు లేకుండా విండీస్‌పై ధైర్యంగా ఆడారంటూ కోహ్లి కితాబిచ్చాడు. పిచ్‌పై అవగాహన ఏర్పర్చుకొని, ఆత్మవిశ్వాసంతో ఆడితే టెస్టుల్లో పరుగులు చేయొచ్చని కోహ్లి తెలిపాడు. యువ ఆటగాళ్లకు విండీస్‌పై అవాంతరాలు ఎదురు కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎదురవుతాయని చెప్పుకొచ్చాడు.

ప్రత్యర్థిని ఆందోళనకు గురి చేసే లక్షణం

ప్రత్యర్థిని ఆందోళనకు గురి చేసే లక్షణం

'ప్రత్యర్థిని ఆందోళనకు గురి చేసే లక్షణం ఉందని తెలుసు కానీ మరీ ఇంత ఉందని ఊహించలేదు. 10 వికెట్లు తీసి ఔట్‌ స్టాండింగ్‌ ప్రదర్శన చేశాడు. శార్దూల్‌ గాయం బారిన పడటంతో కాస్త ఆయోమయంలో పడ్డ మాకు ఉమేశ్ రూపంలో ఊరట లభించింది. షమీ కూడా ఈ టెస్టులో లేడు. దీంతో బౌలర్ల బలం తక్కువగా ఉందని కాస్త ఆందోళన చెందాం. కానీ ఉమేశ్‌ ఉన్నానంటూ తన బాధ్యతను 100శాతానికి మించి నిర్వర్తించాడు' అంటూ కోహ్లీ ప్రశంసల్లో ముంచెత్తాడు.

సొంతగడ్డపై వరుసగా పదో సిరీస్‌

సొంతగడ్డపై వరుసగా పదో సిరీస్‌

తొలి రోజు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ బాగానే పోరాడారు. రెండో రోజు ప్రత్యర్థి బౌలర్లూ సవాలు విసిరారు. మూడో రోజూ ఉదయమూ భారత్‌కు కాస్త ప్రతికూల వాతావరణం ఎదురైనా విజయాన్ని చేజిక్కుంచుకున్నారు. అనూహ్యంగా.. కరీబియన్‌ వీరులను రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగుల తేడాతో చిత్తు చేశారు. దీంతో భారత్‌ సొంతగడ్డపై వరుసగా పదో సిరీస్‌ విజయం సాధించింది.

Story first published: Tuesday, October 16, 2018, 13:24 [IST]
Other articles published on Oct 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+