For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ సారి ఆ జట్టుదే ప్రపంచకప్.. గత 3 టోర్నీల్లో చెప్పినట్టే జరిగింది!

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీకి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. సుమారు రెండు నెలలపాటు ఈ మెగా టోర్నీ అభిమానులను అలరించనుంది. 10 జట్లు పాల్గొనే ప్రపంచకప్‌లో మొత్తం 47 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఈ ప్రపంచకప్ ఎవరు గెలుస్తారనే ప్రశ్న విషయంలో అనేక సమాధానాలు వినిపించాయి. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టైటిల్ నిలబెట్టుకుంటుందని చెప్పగా.. ఇతర మాజీ ప్లేయర్లు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పేర్లను సూచించారు. సొంతగడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీలో టైటిల్ గెలిచే అవకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయని ఇంకొంత మంది అభిప్రాయపడ్డారు.

Astrologer Greenstone Lobo says Captain born in the year 1987 will win 2023 Cricket World Cup

అయితే సైంటిఫిక్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందిన గ్రీన్‌స్టోన్ లోబో మాత్రం టీమిండియానే టైటిల్ గెలుస్తుందని స్పష్టం చేశారు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా వన్డే ప్రపంచకప్ విజేత ఎవరా? అనే విషయంపై మాట్లాడిన గ్రీన్‌స్టోన్ లోబో..రోహిత్ శర్మనే టైటిల్ అందుకునే అవకాశాలున్నాయని జోస్యం చెప్పాడు. రోహిత్ శర్మ 1987లో పుట్టడమే దీనికి ప్రధాన కారణమని లోబో చెప్పుకొచ్చారు.

అయితే భారత్ అంత సులువుగా టైటిల్ గెలవదని, మిగతా జట్లతో తీవ్రంగా పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో లోబో చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ నిజమవ్వడంతో అతని జోస్యానికి ప్రాధానత్య సంతరించుకుంది.

2011లో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని చెప్పిన లోబో.. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్ గెలుస్తుందని చెప్పాడు. 2019లో ఇంగ్లండ్ జట్టు కైవసం చేసుకుంటుందన్నాడు. అతను చెప్పినట్లుగానే ఈ మూడు టోర్నీల్లోనూ జరిగింది.

'గత ప్రపంచకప్‌లో 1986లో పుట్టిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టైటిల్ గెలిచాడు. ఈసారి 1987లో పుట్టిన కెప్టెన్‌, ప్రపంచ కప్ గెలవబోతున్నాడు. ఈ సారి ప్రపంచకప్ బరిలో నిలిచిన కెప్టెన్లలో 1987లో పుట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే. అయితే భారత్‌‌కు అంత ఈజీగా టైటిల్ రాదు. మిగిలిన జట్లన్నీ మంచి పోటీ ఇస్తాయి.'అని గ్రీన్‌స్టోన్ లోబో చెప్పుకొచ్చారు.

ఈ మెగా టోర్నీలో ఆసీస్ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని గ్రీన్ స్టోన్ లోబో తెలిపాడు. కమిన్స్ 1993లో పుట్టాడని, కమిన్స్ జట్టులో ఇప్పటికే కొందరు ప్రపంచకప్ గెలిచారని గుర్తు చేశాడు. మెగా టోర్నీ గెలిచేందుకు కావాల్సిన వైబ్రేషన్స్ ఆస్ట్రేలియా జట్టులో కనిపించడం లేదని చెప్పాడు. ఇంగ్లండ్ జట్టుకు కాస్తో కూస్తో బాగుందని చెప్పిన లోబో.. బట్లర్, కోచ్ మాథ్యూ మాట్‌కు మంచి రోజులు నడుస్తున్నాయని తెలిపాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు కూడా మంచి రోజులు లేవన్నాడు. సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నా.. భారత్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ జాతకం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ జాతకానికి దగ్గరగా ఉంటుంది. అతను కూడా 1987లోనే పుట్టాడు. ఈసారి మెస్సీ, కోపా అమెరికా గెలిచి, వరల్డ్ కప్ గెలిచినట్టే... రోహిత్ కూడా ఆసియా కప్‌తో పాటు వరల్డ్ కప్ గెలుస్తాడు.' అని గ్రీన్‌స్టోన్ లోబో చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, October 4, 2023, 12:27 [IST]
Other articles published on Oct 4, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+