Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: బీసీసీఐకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి మరో స్పాన్సర్ ఔట్!!

Associate central sponsor Future Group pulls out of the IPL 2020

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్‌కు ఆరంభం నుండి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. మార్చిలో ప్రారంభం కావల్సిన క్యాష్ రిచ్ లీగ్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఆ తరువాత ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడడంతో ఐపీఎల్ 2020కి మార్గం సుగమం అయింది. ఆపై ఎన్నో అడ్డంకులను దాటి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది.

బీసీసీఐకి భారీ షాక్

బీసీసీఐకి భారీ షాక్

సరిహద్దు వివాదం కారణంగా 'చైనా వస్తు బహిష్కరణ' ఉద్యమం బలంగా ఉండటంతో.. ఈ ఏడాది టైటిల్‌ స్పాన్సర్‌గా ఉండలేమని చైనాకు చెందిన మొబైల్ సంస్థ 'వివో' ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి రూ.444 కోట్లు నష్టపోయాయి. దానిని పూడ్చుకొనేందుకు బిడ్డింగులు ఆహ్వానించగా.. చివరికి డ్రీమ్‌ 11కు టైటిల్‌ స్పాన్సర్ హక్కులు దక్కాయి. అయితే వివో చెల్లించే దాంట్లో సగం ధరకే డ్రీమ్11 హక్కులు దక్కించుకుంది. ఇక టోర్నీ నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోయాయనుకున్న బీసీసీఐకి మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్‌షిప్ నుంచి 'ఫ్యూచర్ గ్రూప్' తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నాం:

ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నాం:

'టోర్నీ నిర్వహణకు ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. దీనిపై బీసీసీఐతో చర్చలు జరిపినా.. ఎలాంటి ప్రయోజనం కనపడేలేదు. అందుకే ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నాం. జరిమానా చెల్లించినట్లయితేనే బీసీసీఐ దీనికి అంగీకరిస్తుంది' అని ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఓ ప్రధాన అధికారి వెల్లడించారు. ఐపీఎల్ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్న విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు కూడా ధృవీకరించారు.

పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది:

పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది:

'ఐపీఎల్ ఒప్పందం నుండి ఫ్యూచర్ గ్రూప్ వైదొలిగింది. ఫ్యూచర్ గ్రూప్ ఫ్రాంచైజీ గడువు కూడా ముగియనుంది. కానీ ముందుగా తప్పుకొంటున్నందుకు బీసీసీఐకి ఆ కంపెనీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇక 26 రోజులు మాత్రమే ఉంది. ఈ తరుణంలో స్పాన్సర్‌షిప్ సమస్యలు బోర్డును మళ్లీ ఇబ్బంది పెడుతున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే ఈ సంవత్సరం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఫ్యూచర్ గ్రూప్ వైదొలగడం వారిని మరింత కష్టాల్లోకి నెట్టనుంది. ఈ సంస్థ ఐపీఎల్‌తో ఐదేళ్ల పాటు ఒప్పందం కలిగి ఉంది. ఫ్యూచర్ గ్రూప్ వైదొలిగిన తరువాత.. టోర్నమెంట్ అధికారిక స్పాన్సర్ల జాబితా నుండి బీసీసీఐ ఆ సంస్థ పేరును తొలగించింది.

IPL 2020: దుబాయ్‌ లైఫ్‌.. వీడియో షేర్ చేసిన రైనా!!

Story first published: Monday, August 24, 2020, 22:00 [IST]
Other articles published on Aug 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+