Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అటు అయ్యర్ టీమ్.. ఇటు గిల్ సేన! ఒకే రోజు టీమిండియాకు రెండు మ్యాచ్‌లు!

అప్‌కమింగ్ ఆసియా గేమ్స్‌ 2026 క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. జపాన్‌లోని ఐచి నగోయా వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత జట్టు సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్ ఆడనుంది. మెరుగైన ఐసీసీ ర్యాంక్ కారణంగా భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. అయితే ఈ క్రికెట్ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 3న అత్యంత అరుదైన చారిత్రాత్మక ఘటన ఆవిష్కృతం కానుంది.

Asian Games 2026: టెంట్స్‌లో డ్రెస్సింగ్ రూమ్స్.. పక్కనే వాష్ రూమ్స్! పునరాలోచనలో బీసీసీఐ

Asian Games 2026: టెంట్స్‌లో డ్రెస్సింగ్ రూమ్స్.. పక్కనే వాష్ రూమ్స్! పునరాలోచనలో బీసీసీఐ

ఆ ఒక్క రోజే భారత పురుషుల క్రికెట్ జట్టు రెండు వేర్వేరు మ్యాచ్‌లు ఆడనుంది. ఆసియా గేమ్స్ 2026లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు తలపడితే.. అదే రోజు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత వన్డే టీమ్ వెస్టిండీస్‌తో ఆడనుంది. అయితే ఆసియా గేమ్స్ 2026 ఫైనల్‌కు భారత్ చేరితేనే ఈ అరుదైన ఘనత ఆవిష్కృతం కానుంది.

Asian Games Cricket Schedule Announced October 3 Could See Two India Matches in Two Countries After 28 Years

అక్టోబర్ 3న రెండు మ్యాచ్‌లు..

ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 28న భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడనుంది. అక్టోబర్ 1న సెమీఫైనల్స్ జరగనుండగా.. అక్టోబర్ 3న ఫైనల్ జరుగుతుంది. అదే అక్టోబర్ 3న భారత్‌లో న్యూ చండీగఢ్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది. ఒకవేళ భారత జట్టు ఆసియా గేమ్స్ ఫైనల్ చేరితే.. రెండు భారత జట్లు ఒకే రోజున వేర్వేరు దేశాల్లో ఆడుతాయి.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆడనున్నారు. ఆసియా గేమ్స్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ వంటి టాప్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

28 ఏళ్ల తర్వాత..

భారత క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒకే రోజు రెండు మ్యాచ్‌లను వేర్వేరు టీమ్స్ ఆడటం ఇది రెండోసారి. 28 ఏళ్ల క్రితం 1998లో సెప్టెంబర్ 12న కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఒక జట్టు.. టొరంటోలో జరిగిన సహారా కప్‌లో మరో జట్టు తలపడింది. 28 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి సంఘటనే చోటు చేసుకుంటుంది. ఆసియా గేమ్స్ కోసం భారత పురుషుల క్రికెట్ టీమ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనుండగా.. గిల్ సేనను శుభ్‌మన్ గిల్ నడిపించనున్నాడు.

Asian Games 2026: భారత ఆటగాళ్ల కోసం కంటైనర్ రూమ్స్.. సాయ్ ప్రత్యేక ఏర్పాట్లు!

Also Read

Asian Games 2026: భారత ఆటగాళ్ల కోసం కంటైనర్ రూమ్స్.. సాయ్ ప్రత్యేక ఏర్పాట్లు!

ఆసియా గేమ్స్ 2026 కోసం భారత్ 768 మంది అథ్లెట్లు, కోచ్‌లతో కూడిన బృందం జపాన్‌కు వెళ్తుంది. ఇందులో 503 మంది అథ్లెట్లు, 246 మంది కోచ్‌లు ఉన్నారు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌ల సారథ్యంలోని భారత జట్లు స్వర్ణ పతకం సాధించాయి.

Story first published: Tuesday, September 8, 2026, 10:56 [IST]
Other articles published on Sep 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+