Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. ఫైనల్‌కు శ్రీలంక!

ఆసియా గేమ్స్ 2026 టోర్నీలోనూ పాకిస్థాన్‌‌కు ఘోర ఓటమి తప్పలేదు. శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి సెమీఫైనల్లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో శ్రీలంక ఫైనల్ చేరగా.. పాకిస్థాన్ కాంస్య పోరుకు సిద్దమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసింది. షావాల్ జుల్ఫీకర్(50 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), అయేషా జఫర్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ ఫాతిమా సనా(12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) దూకుడుగా ఆడింది. శ్రీలంక బౌలర్లలో కావ్యా కావిండి, చమరి ఆటపట్టు, సుగందిక కుమారి తలో వికెట్ తీసారు.

Asian Games 2026 Chamari Athapaththu s Unbeaten 83 Helps Sri Lanka Beat Pakistan and Reach Final

అనంతరం శ్రీలంక 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 178 పరుగులు చేసి విజయం సాధించింది. చమరి ఆటపట్టు(50 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. హసిని పెరారా(26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో పాతిమా సనా, నష్రా సంధు తలో వికెట్ తీసారు.

ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో కూడా శ్రీలంక చేతిలోనే పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఆసియా గేమ్స్ 2026లోనూ ఆసియా కప్ ఫలితాలే పునరావృతమవుతున్నాయి. ఫైనల్ చేరిన శ్రీలంక‌కు రజత పతకం ఖాయమైంది. ఫైనల్లో భారత్‌తో తలపడే అవకాశం ఉంది.

Story first published: Sunday, September 20, 2026, 13:07 [IST]
Other articles published on Sep 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+