బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశే.. పోరాడి ఓడిన పీవీ సింధు!
Asian Games 2026: 2026 ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ క్యాంపైన నిరాశజనకంగా ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం ఉన్నతి హుడా ఓటమి పాలై నిష్క్రమించడంతో భారత్ కేవలం ఒక్క పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత హ్యాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మెరిసిన భారత్, ఈ సారి ఒక్క వ్యక్తిగత విభాగంలోనూ పతకం సాధించలేకపోవడం గమనార్హం.
చెన్ యు ఫీ చేతిలో పోరాడి ఓడిన పీవీ సింధు
రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో 21-11, 18-21, 10-21 తేడాతో ఓటమి పాలైంది. తొలి గేమ్‌ను 21-11తో చాలా సులువుగా గెలుచుకున్న పీవీ సింధు, రెండో గేమ్‌లోనూ తీవ్రంగా పోరాడింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చెన్ యు ఫీ పూర్తి ఆధిక్యం ప్రదర్శించడంతో సింధు ఓటమిని అంగీకరించక తప్పలేదు. అంతకు ముందు శనివారం రోజునే రెండు మ్యాచ్‌లు ఆడిన సింధు, 24 గంటల వ్యవధిలో మూడో మ్యాచ్ ఆడటంతో తీవ్ర అలసటకు గురైంది.

యమగూచికి గట్టి పోటీ ఇచ్చి ఓడిన ఉన్నతి హుడా
మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 19 ఏళ్ల యువ భారత షట్లర్ ఉన్నతి హుడా, జపాన్‌కు చెందిన మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అకానె యమగూచికి చమటలు పట్టించింది. తొలి గేమ్‌ను 16-21తో కోల్పోయిన ఉన్నతి హుడా, రెండో గేమ్‌లో అద్భుతమైన దాడితో 21-14తో గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది. అయితే అనుభవజ్ఞురాలైన యమగూచి మూడో గేమ్‌ను 21-17తో కైవసం చేసుకోవడంతో ఉన్నతి హుడా పోరాటం ముగిసింది.
డబుల్స్‌లోనూ నిరాశే
మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన త్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీ 18-21, 9-21 తేడాతో మలేషియాకు చెందిన పియర్లీ తాన్-తినా మురళీధరన్ జంట చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తనీషా క్రాస్టో జంట ప్రపంచ నంబర్ 1 చైనా జోడీ ఫెంగ్ యాన్ ఝే-హువాంగ్ డాంగ్ పింగ్‌లకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 14-21, 21-18, 18-21 తేడా పరాజయం పాలయ్యారు.
అలసిపోయిన ఆటగాళ్లు-బిజీ షెడ్యూల్
ఈ టోర్నీలో కఠినమైన మ్యాచ్ షెడ్యూల్ భారత ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. పీవీ సింధు, ఉన్నతి హుడా, ఆయుష్ శెట్టి వంటి ఆటగాళ్లు శనివారం కొద్ది గంటల వ్యవధిలోనే రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల క్వార్టర్ ఫైనల్స్ నాటికి ఆటగాళ్లు శారీరకంగా అలసిపోవడం భారత పతక అవకాశాలను దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


