హాంగ్జౌ: అంతర్జాతీయ క్రికెట్‌లో చెత్త రికార్డు నమోదు అయ్యింది. చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో మంగోలియా మహిళల జట్టు 15 పరుగులకే కుప్పకూలింది. ఈ టోర్నీలో భాగంగా ఇండోనేషియ మహిళల టీమ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మంగోలియా జట్టు 172 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. ని లుహ్ దేవి(48 బంతుల్లో 10 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ని పుటు(35) కీలక ఇన్నింగ్స్ ఆడింది. మంగోలియా జట్టే 49 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మంగోలియా టీమ్ 10 ఓవర్లలో 15 పరుగులకు కుప్పకూలింది. ఏడుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలోనే 5 పరుగులు వచ్చాయి. టాప్ స్కోరర్‌గా బట్జర్గల్(5) నిలిచింది. ఇండోనేషియా బౌలర్లలో అండ్రియానీ (4/8) నాలుగు వికెట్లు తీయగా.. రెహ్మావతి(2/1), ని లుహ్ దేవి(2/4) రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఇక అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఈ ఏడాదే స్పెయిన్‌తో జరిగిన పురుషుల టీ20 మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు 10 పరుగులకే కుప్పకూలింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్‌గా ఉంది.
ఆసియా క్రీడల్లో చాలా రోజుల తర్వాత మళ్లీ క్రికెట్‌ను ప్రవేశ పెట్టగా.. మహిళలతో పాటు పురుషుల మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతుండగా.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో పురుషుల టీమ్ ఈ టోర్నీ ఆడుతోంది. భారత మహిళల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. గురువారం ఉదయం ఈ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
భారత పురుషుల జట్టు అక్టోబర్ 3న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.