Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2023: భారత్‌కు మరో గోల్డ్ మెడల్.. హర్మన్ సేన ఘన విజయం!

హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత్‌ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. మహిళల క్రికెట్‌ ఈవెంట్‌లో భాగంగా శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 19 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ విజయంతో పసిడి పతాకాన్ని అందుకుంది. ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ టీమ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.

Indian Women’s Cricket Team beat Lankans to win Gold Medal

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46), జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 5 ఫోర్లతో 42) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో ఇనోక రణవీర, సుగందిక కుమారి, ఉదేషిక ప్రబోధని రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులే చేసి ఓటమిపాలైంది. లంక బ్యాటర్లలో హసిని పెరెరా(25) నీలాక్షి డిసిల్వా(23), ఓషాడి రణసింఘే(19) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో టిటాస్ సధు మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవిక వైద్య తలో వికెట్ తీసారు.

 Indian Women’s Cricket Team beat Lankans to win Gold Medal

విజేతగా నిలిచిన భారత్‌కు స్వర్ణ పతకం దక్కగా.. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంకకు రజత పతకం వరించింది. మూడో స్థానం కోసం పాకిస్థాన్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళల టీమ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో ఆ జట్టుకు కాంస్య పతకం వరించగా.. పాకిస్థాన్ ఉట్టి చేతులతో ఇంటిదారిపట్టింది.

సొమవారం పోటీల్లో షూటింగ్‌లో గోల్డ్ మెడల్‌ సాధించిన భారత్ రోయింగ్‌లో కాంస్య పతకం నెగ్గింది. భారత మహిళల గోల్డ్ మెడల్‌తో పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. పతక పోటీలు మొదలైన ఆదివారం భారత్ మూడు సిల్వర్ సహా ఐదు మెడల్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రోయింగ్‌లో రెండు సిల్వర్, ఒక బ్రాంజ్, షూటింగ్‌లో ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ సాధించింది.

Story first published: Monday, September 25, 2023, 14:58 [IST]
Other articles published on Sep 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+