Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Games 2026: నో భారత్ X పాక్ మ్యాచ్.. ఎందుకంటే?

ఆసియా గేమ్స్ 2026 టోర్నీకి సంబంధించిన క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. పురుషుల, మహిళల క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను నిర్వాహకులు ప్రకటించారు. అయితే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసే భారత్, పాక్ పోరును లీగ్‌తో పాటు క్వార్టర్స్ దశలో అభిమానులు చూడలేరు.

పురుషుల, మహిళల విభాగాల్లో ఇరు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్ చేరితేనే భారత్, పాక్ పోరు ఉంటుంది. ఇక ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

రెండు విభాగాల్లో టెస్ట్ సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం 6 జట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ‌లో అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్-బీలో చైనా, మలేషియా, ఓమన్ తలపడనున్నాయి.

Asia Games 2026 Cricket Schedule Announced Officially No Guaranteed India Vs Pakistan Clash

గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన టీమ్స్.. క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ నాలుగు జట్లు టాప్-4 టీమ్స్‌తో క్వార్టర్స్ మ్యాచ్ ఆడుతాయి. ఇందులో గెలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ గెలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి. ఓడిన జట్లు కాంస్యపోరులో తలపడుతాయి.

మహిళల ఫార్మాట్ భిన్నం..

మహిళల విభాగంలోనూ 8 జట్లే పోటీపడుతుండటంతో.. నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో జపాన్, థాయ్‌లాండ్‌తో పాకిస్థాన్, చైనాతో బంగ్లాదేశ్, శ్రీలంకతో మలేషియా పోటీపడనున్నాయి. గెలిచిన జట్లు సెమీఫైనల్ చేరనున్నాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్లు స్వర్ణపోరు ఆడనుండగా.. ఓడిన జట్లు కాంస్య పోరులో తలపడనున్నాయి.

అందుకే సిరాజ్ గొప్ప క్రికెటర్ అయ్యాడు.. డీఎస్పీ సాబ్‌కు నా సెల్యూట్: ఎమ్మెస్కే ప్రసాద్

అందుకే సిరాజ్ గొప్ప క్రికెటర్ అయ్యాడు.. డీఎస్పీ సాబ్‌కు నా సెల్యూట్: ఎమ్మెస్కే ప్రసాద్

అప్పుడు రెండు స్వర్ణాలు. .

చైనా వేదికగా జరిగిన 2022 ఆసియా గేమ్స్‌లో భారత్ రెండు విభాగాల్లో స్వర్ణాలు గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో భారత పురుషుల జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టు ఈ ఫీట్ సాధించింది. ఈ ఎడిషన్‌లో పాకిస్థాన్.. రెండు విభాగాల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది.

ఆసియా గేమ్స్‌ ఆడే భారత జట్లు:

పురుషుల టీమ్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, వైభవ్ సూర్యవంశీ.

మహిళల టీమ్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీ రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(కీపర్), జీ కమాలిని(కీపర్), భార్తీ ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుక ఠాకూర్, క్రాంతి గాడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నంధిని శర్మ.

Story first published: Friday, July 24, 2026, 13:21 [IST]
Other articles published on Jul 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+