Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: భారత్‌తో వైరం.. పాకిస్థాన్‌కు తీవ్ర అన్యాయం!

హైదరాబాద్: ఆసియాకప్ 2023కి రంగం సిద్దమైంది. మరో 13 రోజుల్లో 16వ ఎడిషన్‌కు తెరలేవనుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లతో పాటు ఈ సారి కొత్తగా నేపాల్ ఈ టోర్నీకి అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, నేపాల్ గ్రూప్-ఏలో ఉండగా.. శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ గ్రూప్-బిలో ఉన్నాయి.

ఇరు గ్రూప్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధించనుండగా.. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడనున్నాయి. ఈ సారి టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కు ఉండగా.. అక్కడికి వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరించింది. చివరకు యూఏఈ వేదికగా భారత్ మ్యాచ్‌లు నిర్వహించి.. మిగతా మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహించుకుంటామని కోరినా వినలేదు.

Host countries in each edition and their impact on the tourney

ఈ హైబ్రీడ్ మోడల్‌ను ఇతర దేశాలు వ్యతిరేకించాయి. ప్రయాణానికి ఇబ్బందిగా ఉంటాయని తెలిపాయి. చివరకు ఏసీసీ అనేక సమావేశాల అనంతరం శ్రీలంకతో సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. కొన్ని మ్యాచ్‌లు మాత్రమే పాక్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. మెజార్టీ మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.

భారత్‌తో వైరం కారణంగానే పాకిస్థాన్ ఆసియాకప్‌ 2023 టోర్నీకి అతిథ్యం ఇవ్వలేకపోయింది. 29 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో పాకిస్థాన్ ఒకే ఒకసారి ఆతిథ్యం ఇచ్చింది. భారత్ కూడా కేవలం ఒకసారి మాత్రమే ఆతిథ్యం ఇచ్చినా.. టోర్నీ నిర్వహణలో పెత్తనం చెలాయించింది.

ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ఐదేసి సార్లు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా.. శ్రీలంక నాలుగు సార్లు ఆతిథ్యం ఇచ్చింది. తాజా టోర్నీతో బంగ్లాదేశ్ సరసన నిలిచింది.

1984లో యూఏఈ వేదికగా తొలి ఎడిషన్ జరగగా.. 1986 ఎడిషన్ శ్రీలంక వేదికగా జరిగింది. శ్రీలంకతో ఉన్న విభేదాలతో ఈ టోర్నీని భారత్ బహిష్కరించింది. 1988 టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వగా.. 1990-91 టోర్నీని భారత్ నిర్వహించింది. బంగ్లాదేశ్ 1988, 2000, 2012, 2014, 2016, 2018 టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చింది. 2012, 2016, 2018 టోర్నీల్లో ఫైనల్ చేరిన ఆ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

2008 ఎడిషన్‌కు మాత్రమే పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వగా.. శ్రీలంక 1986, 1997, 2004, 2010 టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ నాలుగు టోర్నీల్లో మూడుసార్లు ఆ జట్టు విజేతగా నిలవడం గమనార్హం.

Story first published: Thursday, August 17, 2023, 20:46 [IST]
Other articles published on Aug 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+