Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup Rising Stars: భారత్ X పాక్ మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో శుభారంభం చేసిన భారత్-ఏ జట్టు మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. శత్రు దేశం పాకిస్థాన్‌ షాహీన్స్‌తో ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే గ్రూప్‌బీ మ్యాచ్‌లో జితేశ్ శర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. యూఏఈతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్-ఏ 148 పరుగుల భారీ తేడాతో రికార్డ్ విజయాన్నందుకుంది.

టీమిండియా టీనేజ్ సెన్సేషన్, 14 ఏళ్ల సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. 42 బంతుల్లోనే 144 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. 11 ఫోర్లు, 15 సిక్సర్లతో వీర విహారం చేశాడు. ఈ బుడ్డోడితో కెప్టెన్ జితేష్ శర్మ(32 బంతుల్లో 8 ఫోర్లతో 83 నాటౌట్)కూడా చెలరేగడంతో భారత్-ఏ జట్టు 297 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. అనంతరం యూఏఈ 149 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Asia Cup Rising Stars How to Watch India A vs Pakistan Shaheens Match For Free
Photo Credit: X (twitter)

వైభవ్ చెలరేగితే..

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని భారత్-ఏ జట్టు భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ షాహీన్స్ కూడా యూఏఈపై 40 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే వైభవ్ సూర్యవంశీ మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడితే పాకిస్థాన్ తేలిపోనుంది. వైభవ్ సంచలన బ్యాటింగ్‌తో ఈ భారత్-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొన్నాళ్లుగా భారత్‌తో జరిగిన అన్నీ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ చిత్తుగా ఓడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడుతున్నా భారత ఆటగాళ్లు వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. కుర్రాళ్ల మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ కానుంది.

సెలవు దినమైన ఆదివారం భారత్-ఏ vs పాక్-ఏ మ్యాచ్ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టోర్నీకి సోనీ టీవీ, సోనీ లీవ్, ఫ్యాన్ కోడ్ అధికార బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ మూడు వేదికల్లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే ఈ వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే రుసుము చెల్లించి సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి. కానీ ప్రత్యేకమైన రిచార్జ్ ప్లాన్స్‌తో సోనీ లీవ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు.

జట్లు:

భారత్-ఏ: జితేశ్ శర్మ(కెప్టెన్), నమన్ ధీర్(వైస్ కెప్టెన్), అభిషేక్ పోరెల్, ప్రియాన్ష్ ఆర్య, హర్ష్ దూబే, గుర్జప్‌నీత్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అషుతోష్ శర్మ, సూర్యాన్ష్ షెగ్దే, వైభవ్ సూర్యవంశీ, సుయాష్ శర్మ, విజయ్ కుమార్ వైశాఖ్, నెహాల్ వధేరా, యశ్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్.

పాకిస్థాన్ షాహీన్స్: ఇర్ఫాన్ ఖాన్(కెప్టెన్), అహ్మద్ దనియల్, అరఫత్ మిన్హాస్, ఘజీ ఘోరి, మాజ సదఖత్, మహమ్మద్ ఫైక్, మహమ్మద్ నయీమ్, మహమ్మద్ సల్మాన్, ముబ్‌సన్ ఖాన్, ముహమ్మద్ షెహ్‌జాద్, సాద్ మసూద్, షాహీద్ అజీజ్, సఫియాన్ ముఖీమ్, ఉబైద్ షా, యాసిర్ ఖాన్.

Story first published: Saturday, November 15, 2025, 15:29 [IST]
Other articles published on Nov 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+