Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BAN vs SL: మలుపు తిప్పిన హసరంగా.. శ్రీలంక ఘన విజయం!

ఆసియా కప్ 2025 టోర్నీలో శ్రీలంక శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో వానిందు హసరంగా (2/25), బ్యాటింగ్‌లో పాతుమ్ నిస్సంక(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. జాకెర్ అలీ(34 బంతుల్లో 2 ఫోర్లతో 41), షమీమ్ హొస్సేన్(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా(2/25) రెండు వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, దుష్మంత్ చమీరా చెరో వికెట్ తీసారు. కెప్టెన్ లిటన్ దాస్(28)తో పాటు మెహ్‌దీ హసన్(9)ను పెవిలియన్ చేర్చి హసరంగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

Asia Cup 2025 Wanindu Hasaranga Shines as Sri Lanka Defeats Bangladesh

అనంతరం శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కమిల్ మిషార(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరి ధాటికి 32 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక లక్ష్యాన్ని చేధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్(2/29) రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ షకీబ్ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Saturday, September 13, 2025, 23:52 [IST]
Other articles published on Sep 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+