Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ ఘన విజయం!

ఆసియా కప్ 2025 టోర్నీ‌ సూపర్-4 దశలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. శ్రీలంకతో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన బంగ్లాదేశ్.. అనంతరం బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. డసన్ షనక(37 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండీస్(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34), పాతుమ్ నిస్సంక(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/20) మూడు వికెట్లు తీయగా.. మెహ్‌ది హసన్(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీసాడు.

Asia Cup 2025 Towhid Hridoy Saif Hassan Fifties Power Bangladesh to Victory Over Sri Lanka in Super Four Clash

అనంతరం బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ సైఫ్ హసన్(45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), టౌహిడ్ హృదయ్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(2/22), డసన్ షనక(2/21) రెండేసి వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, దుష్మంత చమీరా ఒక వికెట్ పడగొట్టాడు.

ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరమవ్వగా.. జాకెర్ అలీ బౌండరీ బాది స్కోర్లను సమం చేశాడు. అయితే మరుసటి బంతికే అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మెహ్‌దీ హసన్ ఓ బంతిని డాట్ చేసి మరుసటి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో చివరి 2 బంతుల్లో బంగ్లా విజయానికి 1 పరుగుల అవసరమైంది. కానీ క్రీజులోకి వచ్చిన షమీమ్ హొస్సేన్(1) ఎలాంటి తప్పిదం చేయకుండా సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Saturday, September 20, 2025, 23:46 [IST]
Other articles published on Sep 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+