Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: అతన్ని టెస్ట్‌లకే పరిమితం చేయండి: సునీల్ గవాస్కర్

ఆసియా కప్ 2025 టోర్నీకి టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను దూరంగా ఉంచాలని హెడ్ కోచ్ గౌతం గంభీర్‌తో పాటు సెలెక్టర్ల మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. బుమ్రా టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయాలన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌‌కు టీమిండియా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. ఇంగ్లండ్ పర్యటనలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే బుమ్రా ఆసియాకప్ 2025 ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025 జరగనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలోనే బుమ్రాను తీసుకోవాలని కొందరంటే వద్దని మరికొందరు అంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన గవాస్కర్.. బుమ్రాను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపిక చేయాలన్నాడు.

Asia Cup 2025 Sunil Gavaskar Reveals Jasprit Bumrah Told Selectors He Could Play Only 3 of 5 England Tests

'జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రావాలి. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో అతను కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు. ఇది పెద్ద చర్చకు దారి తీసింది. అయితే అతను తాను మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని, సెలెక్షన్ కమిటీకి ముందుగానే సూచించాడు. టీమిండియా తదుపరి టెస్ట్‌లను అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో ఆడనుంది.

ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ బరిలో నిలవనుంది. ఈ రెండు సిరీస్‌ల మధ్య నెల రోజుల విరామం మాత్రమే ఉంది. బుమ్రాకు ఈ విశ్రాంతి సరిపోతుంది. సెలెక్టర్లు బుమ్రాను ద్వైపాక్షిక సిరీస్‌లు పరిమితం చేయకుండా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ దృష్టిలో పెట్టుకొని అతని సేవలను ఉపయోగించుకోవాలి. కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంపై ఫోకస్ పెట్టాలి.'అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

Story first published: Monday, August 18, 2025, 19:56 [IST]
Other articles published on Aug 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+