ఆసియా కప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది కొత్త పిచ్‌లా ఉంది. అందుకే బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఆసియాకప్ 2022 విజయం ఒక మంచి జ్ఞాపకం. ఆ జోరు కొనసాగాలని కోరుకుంటున్నాం. కెప్టెన్‌గా నాకు ఇది అతిపెద్ద సవాల్. మా జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. 7 మంది బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. హసరంగా కూడా ఆడుతున్నాడు.'అని అసలంక చెప్పుకొచ్చాడు.
ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాసన్ అన్నాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేసేందుకు రెడీ. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో బాగానే ఆడాం. కొన్ని విషయాల్లో మెరుగవ్వాలి. ఒక మ్యాచ్ గెలవాలంటే ప్రతిదీ సరిగ్గా జరగాలి. టస్కిన్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో షోరిఫుల్ వచ్చాడు.'అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్ : పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్ (వికెట్ కీపర్/కెప్టెన్), తౌహిద్ హృదయ్, జకర్ అలీ, షమీమ్ హుస్సేన్, మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ షకీబ్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహమాన్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కమిల్ మిషార, కుసల్ పెరెరా, చరిత్ అసలంక(c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మతీషా పతిరణ, నువాన్ తుషార.