Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: అటల్ విధ్వంసం.. అజ్మతుల్లా ఊచకోత!

ఆసియా కప్ 2025 టోర్నీని అఫ్గాన్ బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు. హాంగ్ కాంగ్‌తో తొలి మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్(21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది.

మహమ్మద్ నబీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంగ్ కాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుష్ శుక్లా రెండేసి వికెట్లు తీయగా.. అతీక్ ఇక్బాల్, ఇషాన్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. చెత్త ఫీల్డింగ్ హాంగ్ కాంగ్ కొంపముంచింది. మూడు సునాయస క్యాచ్‌లను హాంగ్ కాంగ్ ఫీలర్లు నేలపాలు చేశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్(8) క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఇబ్రహీమ్ జడ్రాన్‌ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 26 పరుగులకే అఫ్గాన్ రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మహమ్మద్ నబీతో కలిసి సెదిఖుల్లా అటల్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో అఫ్గాన్ 2 వికెట్లకు 41 పరుగులే చేసింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని కించిత్ షా విడదీసాడు. ఊరించే బంతితో మహమ్మద్ నబీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

Asia Cup 2025 Sediqullah Atal s 73 and Omarzai s Blistering 53 Power Afghanistan to 188 6 vs Hong Kong
Photo Credit: X (twitter)

దాంతో మూడో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చి గుల్బాదిన్ నైబ్(5) కూడా అనవసర షాట్‌తో పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్.. హాంగ్ కాంగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లతో పరుగులు రాబట్టాడు. అటల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో అఫ్గాన్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో 20 బంతుల్లోనే అజ్మతుల్లా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని ఆయుష్ శుక్లా ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి వచ్చిన కరీమ్ జన్ ఔటవ్వగా.. కెప్టెన్ రషీద్ ఖాన్(3 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

Story first published: Tuesday, September 9, 2025, 22:15 [IST]
Other articles published on Sep 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+