Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs HK: అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నా: రషీద్ ఖాన్

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా హాంగ్ కాంగ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తెలిపాడు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నమోదు చేస్తామన్నాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. బ్యాటింగ్‌‌కు అనుకూలమైన వికెట్ ఇది. మంచి స్కోర్ బోర్డుపై ఉంటే బౌలర్ల పని ఈజీ అవుతుంది. టీ20ల్లో టాస్ గెలిచామా? లేదా? అనేది ముఖ్యం కాదు. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం చాలా కీలకం. అందుకు కావాల్సిన అవకాశాలను సృష్టించుకోవాలి. ముక్కోణపు సిరీస్ ఫైనల్ ముగిసిన కథ. తాజా మ్యాచ్‌పైనే మేం ఫోకస్ పెట్టాం. ఒకవేళ ఆ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచినా కూడా ఈ రోజు మేం ఈ మ్యాచ్‌పై ఫోకస్ పెట్టేవాళ్లం. ఆ ఫైనల్ టీమ్‌లో ఒకే ఒక్క మార్పు చేశాం. డార్విష్ స్థానంలో గుల్బదిన్ రీఎంట్రీ ఇచ్చాడు.'అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.

Asia Cup 2025 Rashid Khan Reveals Batting First Was Part Of Afghanistan s Strategy Against Hong Kong
Photo Credit: Asian Cricket Council

టాస్ గెలిచినా తాము బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని హాంగ్ కాంగ్ కెప్టెన్ మాసిమ్ ముర్తజా తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా.. బౌలింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ టోర్నీ ఆడేందుకు మేం చాలా కష్టపడ్డాం. క్వాలిఫయర్స్‌లో మేం మంచి క్రికెట్ ఆడాం. మా ప్రధాన ఆటగాడైన కల్హన్ చల్లు ఈ వేదికపై ఎలా రాణిస్తాడో కెప్టెన్‌గా చూడాలని ఉంది.'అని హాంగ్ కాంగ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

తుదిజట్లు:

అఫ్ఘానిస్థాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), సెదిఖుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్, గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాఈ, మహమ్మద్ నబీ, కరీమ్ జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, ఏఎం ఘన్జాఫర్, ఫజల్హాక్ ఫారూఖీ.

హాంగ్ కాంగ్: జీషన్ అలీ(w), బాబర్ హయాత్, అన్షుమన్ రథ్, కల్హన్ చల్లు, నిజాకత్ ఖాన్, ఐజాజ్ ఖాన్, కించిత్ షా, యాసిమ్ ముర్తజా(c), ఆయుష్ శుక్లా, అతీక్ ఇక్బాల్, ఎహ్సాన్ ఖాన్.

Story first published: Tuesday, September 9, 2025, 20:03 [IST]
Other articles published on Sep 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+