Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: అందుకే ఆ ఇద్దర్నీ తప్పించాం: పాక్ కెప్టెన్

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డూ ఆర్ డై గేమ్‌లో యూఏఈ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని యూఏఈ సారథి ముహమ్మద్ వసీం తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజు వాతావరణం చూస్తుంటే.. మంచు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం. ఇది మాకు డూ ఆర్ డై మ్యాచ్. అబుదాబిలో మేం గొప్ప మ్యాచ్ ఆడాం. ఈ రోజు పిచ్, మ్యాచ్ వేరు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. జవాదుల్లా స్థానంలో సిమ్రంజిత్ జట్టులోకి వచ్చాడు.'అని వసీం చెప్పుకొచ్చాడు.

Asia Cup 2025 Pakistan Skipper Salman Agha Explains Playing XI Changes for UAE Clash
Photo Credit: Asian Cricket Council

మరోవైపు టాస్ గెలిచినా తాము బ్యాటింగ్‌ ఎంచుకునేవాళ్లమని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యంతో యూఏఈ‌పై ఒత్తిడి పెంచాలనుకున్నాం. ఒక మంచి గేమ్ ఆడేందుకు ఇది మాకు గొప్ప అవకాశం. యూఏఈ చాలా మంచి జట్టు. మేం మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తే ఏ జట్టుపైన అయినా విజయం సాధిస్తాం. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. సుఫియాన్, ఫహీమ్ స్థానాల్లో హారిస్, ఖుష్దీల్ జట్టులోకి వచ్చారు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మార్పులు చేశాం.'అని సల్మాన్ తెలిపాడు.

గ్రూప్-ఏలో ఇది కీలక మ్యాచ్.. ఇందులో గెలిచిన జట్టే సూపర్-4కు అర్హత సాధిస్తోంది. గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే టీమిండియా వరుసగా రెండు విజయాలు సాధించి సూపర్-4 చేరింది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌తో షేక్ హ్యాండ్ వివాదంపై పాకిస్థాన్ జట్టు నిరసన వ్యక్తం చేస్తూ.. మైదానానికి ఆలస్యంగా వచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేయగా.. ఐసీసీ నిరాకరించింది. దాంతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని పీసీబీ భావించింది. కానీ తమ క్రికెట్ పెద్దలతో సుదీర్ఘ చర్చల అనంతరం మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. ఆర్థికంగా నష్టపోతామని భావించే పీసీబీ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

తుది జట్లు:

పాకిస్థాన్: సైమ్ ఆయుబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హారిస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా(c), ఖుష్‌దిల్ షా, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.

యూఏఈ: అలీషాన్ షరాఫు, ముహమ్మద్ వసీం(c), ఆసిఫ్ ఖాన్, ముహమ్మద్ జోహైబ్, హర్షిత్ కౌశిక్, రాహుల్ చోప్రా(w), ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, ముహమ్మద్ రోహిద్ ఖాన్, సిమ్రంజిత్ సింగ్, జునైద్ సిద్ధిక్.

Story first published: Wednesday, September 17, 2025, 20:58 [IST]
Other articles published on Sep 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+