Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: అఫ్గాన్‌ శుభారంభం.. హాంగ్ కాంగ్‌‌పై ఘన విజయం!

ఆసియా కప్ 2025 టోర్నీ అఫ్గానిస్థాన్ శుభారంభం చేసింది. హాంగ్ కాంగ్‌తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అప్గానిస్థాన్ 94 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో సెదిఖుల్లా, అజ్మతుల్లా సత్తా చాటగా.. బౌలర్లు సమష్టిగా రాణించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్(21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మహమ్మద్ నబీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంగ్ కాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుష్ శుక్లా రెండేసి వికెట్లు తీయగా.. అతీక్ ఇక్బాల్, ఇషాన్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. చెత్త ఫీల్డింగ్ హాంగ్ కాంగ్ కొంపముంచింది. మూడు సునాయస క్యాచ్‌లను హాంగ్ కాంగ్ ఫీలర్లు నేలపాలు చేశారు.

Asia Cup 2025 Opener Afghanistan Beat Hong Kong to Kick Off Campaign with Dominant Win

అనంతరం హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులే చేసి ఓటమిపాలైంది. బబర్ హయత్(43 బంతుల్లో 3 సిక్స్‌లతో 39), కెప్టెన్ యాసిమ్ ముర్తాజా(16) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్(2/8), ఫజలక్ ఫరూఖీ(2/16) రెండేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, తలో వికెట్ తీసారు. మరో ఇద్దరు బ్యాటర్లు రనౌటయ్యారు.

Story first published: Tuesday, September 9, 2025, 23:57 [IST]
Other articles published on Sep 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+