Asia Cup 2025: యూఏఈ కొంపముంచిన ఆఖరి ఓవర్!
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో యూఏఈ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అసాధారణ బౌలింగ్‌తో పాకిస్థాన్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. కానీ ఆఖరి ఓవర్‌లో ముహమ్మద్ రోహిద్ ఖాన్ చేసిన తప్పిదం.. ఆ జట్టుకు తీరని నష్టం చేసింది. స్లో ఓవర్ రేట్ కూడా ఆ జట్టు కొంపముంచింది. నిర్ణీత సమయం కంటే ఒక ఓవర్ ఆలస్యమైంది. దాంతో ఆఖరి ఓవర్‌లో సర్కిల్ బయట ఒక ఫీల్డర్ తక్కువగా ఉంచాల్సి వచ్చింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న షాహిన్ షా అఫ్రిది మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఆఖరి ఓవర్‌లో అతను వరుసగా 6, 6, 4 బాది 18 పరుగులు పిండుకున్నాడు. దాంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి గౌరవ ప్రదమైన స్కోర్ అందుకుంది. ఫకార్ జమాన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. షాహిన్ షా అఫ్రిది(14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) మరోసారి మెరుపులు మెరిపించాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్(4/14) నాలుగు వికెట్లు తీయగా.. సిమ్రంజిత్ సింగ్(3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. ధ్రువ్ పరషార్ ఒక వికెట్ తీసాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. పాకిస్థాన్ ఓపెనర్లు సైమ్ అయుబ్(0), ఫర్హాన్(5) తీవ్రంగా నిరాశపర్చారు. కెప్టెన్ సల్మాన్ అఘా(20)తో కలిసి ఫకార్ జమాన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో పాకిస్థాన్ 2 వికెట్లకు 39 పరుగులు మాత్రమే చేసింది. సల్మాన్ అఘా నిదానంగా ఆడగా.. ఫకార్ జమాన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడీని పరషార్ విడదీసాడు.
సల్మాన్ అలీ అఘాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫకార్ జమాన్ భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన హసన్ నవాజ్(3), కుష్దిల్ షా(4), మహమ్మద్ నవాజ్(4) తీవ్రంగా నిరాశపర్చారు. మహమ్మద్ హరిస్(18) కాసేపు క్రీజులో ఉండగా.. షాహీన్ షా అఫ్రిది భారీ షాట్లతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications