For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2025 షెడ్యూల్‌లో మార్పు.. ఎందుకంటే?

ఆసియా కప్ 2025 షెడ్యూల్‌లో కీలక మార్పు జరిగింది. మ్యాచ్‌ల సమయాన్ని మారుస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఫైనల్‌తో సహా మొత్తం 18 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ 18 మ్యాచ్‌ల టైమింగ్స్‌ను ఏసీసీ మార్చింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు.. సవరించిన సమయం ప్రకారం 8 గంటలకు మొదలవుతాయి.

సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లు 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం దుబాయ్‌లో విపరీతమైన ఎండలు కొడుతుండటంతో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్కపోత నుంచి ఆటగాళ్లను రక్షించేందుకే మ్యాచ్‌ సమయాలను మార్చినట్లు ఏసీసీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. యూఏఈ, పాకిస్థాన్, ఓమన్‌లతో భారత్ గ్రూప్‌-ఏలో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ గ్రూప్‌ బీలో ఉన్నాయి. భారత్, పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే మూడు సార్లు తలపడనున్నాయి.

Asia Cup 2025 Match Timings Revised to Avoid Heat All Matches to Start at 8 PM IST


ఆసియా కప్ 2025 - రివైజ్డ్ షెడ్యూల్

సెప్టెంబర్ 9 - ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 10 - భారతదేశం vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 11 - బంగ్లాదేశ్ vs హాంకాంగ్, అబుదాబి - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 12 - పాకిస్తాన్ vs ఒమన్, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 13 - బంగ్లాదేశ్ vs శ్రీలంక, అబుదాబి - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 14 - భారతదేశం vs పాకిస్తాన్, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 15 - యూఏఈ vs ఒమన్, అబుదాబి - సాయంత్రం 5:30 గంటలు

సెప్టెంబర్ 15 - శ్రీలంక vs హాంకాంగ్, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 16 - బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 17 - పాకిస్తాన్ vs యూఏఈ, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 18 - శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 19 - భారతదేశం vs ఒమన్, అబుదాబి - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 20 - B1 vs B2, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 21 - A1 vs A2, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 22 - విశ్రాంతి దినం

సెప్టెంబర్ 23 - A2 vs B1, అబుదాబి - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 24 - A1 vs B2, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 25 - A2 vs B2, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 26 - A1 vs B1, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 27 - విశ్రాంతి దినం

సెప్టెంబర్ 28 - ఫైనల్, దుబాయ్ - రాత్రి 8 గంటలు

సెప్టెంబర్ 29 - రిజర్వ్ డే

Story first published: Saturday, August 30, 2025, 16:28 [IST]
Other articles published on Aug 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+