Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs UAE: నిప్పులు చెరిగిన కుల్దీప్, శివమ్ దూబే!

ఆసియా కప్ 2025 టోర్నీని భారత బౌలర్లు ఘనంగా ప్రారంభించారు. యూఏఈతో తొలి మ్యాచ్‌లో భారత వెరటన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/7), పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే(3/3) అద్భుత బౌలింగ్‌తో నిప్పులు చెరిగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 13 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ అలిషన్ షరఫు(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), కెప్టెన్ ముహమ్మద్ వసీం(22 బంతుల్లో 3 ఫోర్లతో 19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్, శివమ్ దూబేకు తోడుగా జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ అలిషన్ షరఫు‌ను స్టన్నింగ్ యార్కర్‌తో జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరసటి ఓవర్‌లోనే ముహమ్మద్ జోహైబ్(2)ను వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో యూఏఈ 2 వికెట్లకు 41 పరుగులే చేసింది.

Asia Cup 2025 Kuldeep Yadav and Shivam Dube Demolish UAE Bowl Them Out for 57

ఆ తర్వాత శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ ధాటికి 16 పరుగుల వ్యవధిలోనే యూఏఈ చివరి 8 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్‌లో కెప్టెన్ ముహమ్మద్ వసీం(19), రాహుల్ చోప్రా(3), హర్షి కౌశిక్(2) వరుసగా పెవిలియన్ చేరారు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడంతో యూఏఈ కోలుకోలేకపోయింది. అక్షర్ పటేల్‌తో పాటు శివమ్ దూబే కూడా చెలరేగడంతో యూఏఈ నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది.

Story first published: Wednesday, September 10, 2025, 21:28 [IST]
Other articles published on Sep 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+