For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2025: టీమిండియా బలాలు.. బలహీనతలు ఇవే!

ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఆసియా టోర్నీకి తెరలేవనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ కోసం ఆసియా క్రికెట్ దేశాలు సిద్దమయ్యాయి. ఆతిథ్య యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, ఒమన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్‌లు బరిలోకి దిగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.

సెప్టెంబర్ 10న(బుధవారం) ఆతిథ్య యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14(ఆదివారం) దాయాదీ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సెప్టెంబర్ 19న ఒమనతో ఆఖరి లీగ్ మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి సూపర్ -4 మ్యాచ్‌లు జరగనుండగా.. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది.

ఇప్పటికే ఈ టోర్నీ కోసం యూఏఈ చేరుకున్న సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ టోర్నీలో టీమిండియానే హాట్‌ఫేవరేట్‌గా కనిపిస్తున్నా... పొట్టి ఫార్మాట్‌లో ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం. దాయాదీ పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురువ్వనుంది. ఈ క్రమంలోనే భారత జట్టు బలాలు, బలహీనతలపై ఓ లుక్కెద్దాం.

Asia Cup 2025 India s SWOT Analysis

టీమిండియా బలాలు..

గతేడాదిగా టీ20 ఫార్మాట్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసింది. అంతేకాకుండా ఈ ఫార్మాట్‌లో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫియర్‌లెస్ గేమ్‌తో బ్యాటింగ్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో నిలకడగా 250 ప్లస్ రన్స్ చేసింది. యూఏఈలో పిచ్‌లు కఠినంగా ఉన్నా.. బ్యాటింగ్‌కు ప్రతికూలమైనా.. భారీ స్కోర్లు నమోదు చేసే సత్తా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు ఉంది. శుభ్‌మన్ గిల్ రీఎంట్రీతో టీమిండియా బ్యాటింగ్ మరింత బలోపేతమైంది. ఐపీఎల్‌‌తో పాటు ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చిన గిల్.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దుబాయ్ వంటి స్లో వికెట్‌లపై కూడా గిల్ రాణించగలడు.

భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో పేస్ విభాగం మరింత బలోపేతమైంది. అతనికి అర్ష్‌దీప్ సింగ్ అండగా ఉండనున్నాడు. వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో స్పిన్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. యూఏఈ వేదికగానే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ రూపంలో పార్ట్ టైమ్ బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు.

బలహీనతలు..

టీమిండియా టీ20 ఫార్మాట్ ఆడి చాలా రోజులైంది. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఐపీఎల్ తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత ఆటగాళ్లు ఆడలేదు. టీమిండియా టాప్ ఆర్డర్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉన్పప్పటికీ.. మిడిలార్డర్‌లో ఎవర్ని ఆడిస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబేల్లో ఎవర్నీ ఆడిస్తారు? అనేదానిపై స్పష్టత లేదు. అంతేకాకుండా ఎనిమిదో స్థానంలో ఎవర్నీ ఆడించాలనేది సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్‌కు తలనొప్పిగా మారింది. ఎక్స్‌ట్రా బ్యాటర్ తీసుకుంటే.. బౌలింగ్ బలహీనం కానుంది. బౌలర్‌ను తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ మిస్ కానుంది. హై రిస్క్ బ్యాటింగ్ అప్రోచ్ కలిగిన భారత్‌కు ఎక్స్‌ట్రా బ్యాటర్ ఉండటమే ఉత్తమం.

భారత్ ఓటమి అద్భుతమే..

ఆసియా కప్ 2025లో భారత జట్టు అంత బలంగా మరే టీమ్ లేదు. ఈ టోర్నీలో భారత్ ఓడాలంటే అద్భుతమే జరగాలి. ఎటువంటి పొరపాట్లు లేకుండా అటాకింగ్ అప్రోచ్‌తో భారత్ ఆడితే సునాయసంగా టైటిల్ గెలుస్తోంది.

భారత్ షెడ్యూల్

సెప్టెంబర్ 10: భారత్ X యూఏఈ- దుబాయ్(రాత్రి 8 గంటలకు)

సెప్టెంబర్ 14: భారత్ X పాకిస్థాన్- దుబాయ్(రాత్రి 8 గంటలకు)

సెప్టెంబర్ 19: భారత్ X ఒమన్- అబుదాబి(రాత్రి 8 గంటలకు)

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకు సింగ్.

Story first published: Monday, September 8, 2025, 15:47 [IST]
Other articles published on Sep 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+