Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

HK vs BAN: హాంగ్ కాంగ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్

ఆసియా కప్ 2025లో భాగంగా హాంగ్ కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ తెలిపాడు. ఈ టోర్నీకి ముందు ఆడిన మూడు సిరీస్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేశామని చెప్పాడు.

అయితే ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. ఈ టోర్నీలో తమకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమేనని, విజయం కోసం 100 శాతం కృషి చేస్తామని పేర్కొన్నాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని హాంగ్ కాంగ్ కెప్టెన్ యసిమ్ ముర్తాజా తెలిపాడు. టాస్ ఓడినా తాము కోరుకున్నదే దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. గత మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో తమ బ్యాటర్లు తప్పులు చేశారని, దాంతోనే ఓటమిపాలయ్యామని చెప్పాడు. గతం గతహా అని, ఈ రోజు కొత్త మ్యాచ్ అని, విజయం కోసం కృషి చేస్తామని తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌‌‌లో హాంగ్ కాంగ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Asia Cup 2025 Bangladesh Wins Toss Decides to Bowl First vs Hong Kong

తుది జట్లు

బంగ్లాదేశ్ : పర్వేజ్ హొస్సేన్ ఇమోన్, తంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ (w/c), తౌహిద్ హ్రిదోయ్, షమీమ్ హొస్సేన్, జాకెర్ అలీ, మెహెది హసన్, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ షకిబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్

హాంకాంగ్ : జీషన్ అలీ (w), అంషుమాన్ రథ్, బాబర్ హయాత్, నిజాకత్ ఖాన్, కల్హాన్ చల్లు, కించిత్ షా, యాసిమ్ ముర్తాజా (c), ఐజాజ్ ఖాన్, ఎహసాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, అతీఖ్ ఇక్బాల్

Story first published: Thursday, September 11, 2025, 19:51 [IST]
Other articles published on Sep 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+