Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు.. శుభ్‌మన్ గిల్ కోసం కోహ్లీ త్యాగం!

హైదరాబాద్: ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో కోసం టీమిండియా సన్నదమవుతోంది. టీమిండియా కాంబినేషన్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన మేనేజ్‌మెంట్ ఇప్పటికే వెస్టిండీస్ గడ్డపై ప్రయోగాలు చేసింది. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియాకప్‌ను మెగా టోర్నీకి ట్రైలర్‌గా వాడుకోనుంది.

ఆసియాకప్‌కు ఫైనల్ చేసిన టీమ్ కాంబినేషన్‌నే వన్డే ప్రపంచకప్‌లో కొనసాగించనున్నారు. ఫలితాన్ని బట్టి ఒకటి రెండు మార్పులు మినహా భారత ప్రపంచకప్ జట్టులో పెద్ద తేడాలు ఉండే అవకాశం లేదు. ఈ క్రమంలోనే ఆసియాకప్‌లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Asia Cup 2023:

అయితే గాయాలతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడం సమస్యగా మారింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పూర్తిగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు కేఎల్ రాహుల్‌ను ప్రధాన వికెట్ కీపర్‌గా భావించిన టీమ్‌మేనేజ్‌మెంట్.. ఐదో స్థానంలో ఆడించింది. శ్రేయస్ అయ్యర్‌ను నాలుగో స్థానంలో బరిలోకి దించింది.

రాహుల్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే బ్యాటింగ్ ఆర్డర్‌ను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగితే శుభ్‌మన్ గిల్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడించాల్సి వస్తోంది. అప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరేట్ ప్లేస్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది.

నెంబర్-3లో విరాట్ కోహ్లీ అసాధారణ రికార్డు ఉంది. అతను చేసిన 12898 వన్డే పరుగుల్లో 10777 ఫస్ట్ డౌన్‌లోనే వచ్చాయి. 46 వన్డే శతకాల్లో 39 మూడో స్థానంలోనే సాధించాడు. సీనియర్ ప్లేయర్‌గా టీమ్ కోరకు అతను నెంబర్ 4లో ఆడాల్సి ఉంటుంది.

ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంల సూర్య లేదా శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే కోహ్లీ మూడో స్థానం త్యాగం చేస్తాడా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Story first published: Saturday, August 5, 2023, 20:39 [IST]
Other articles published on Aug 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+