Asia Cup 2023 ప్రోమో విడుదల.. ధనాధన్ పోరు ఎప్పుడంటే?
దుబాయ్: జరుగుతుందో.. జరగదో అనుకున్నా ఆసియాకప్ 2023కి రంగం సిద్దమైంది. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ 2023 జరగనుంది. ఆరు దేశాలు పాల్గొనే ఈ మినీ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు లెక్కన హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఆసియా కప్ థీమ్‌ను వెల్లడిస్తూ ఓ వీడియో ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది.

టీమిండియా ప్రయాణంతో పాటు ఆసియా దేశాల మినీ టోర్నీ గురించి వీడియోలో పేర్కొంది. ప్రపంచ కప్ కంటే ముందు జరిగే ఆసియా కప్‌ను కొట్టండి.. అంటూ భారత జట్టును ప్రోత్సహించింది. భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని, ఎంజాయ్ చేయండని చెబుతూ వీడియోను ముగించింది.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కు ఉండగా.. అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించింది. భద్రతా కారణాలతో పాటు ప్రభుత్వ అనుమతిని ఇబ్బందిగా పేర్కొంది. దాంతో పీసీబీ.. హైబ్రిడ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది.
భారత్ మ్యాచ్‌లను తటస్థ వేదిక అయిన దుబాయ్‌లో నిర్వహించి.. మిగతా మ్యాచ్‌లను పాక్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను బంగ్లాదేశ్, శ్రీలంకలు వ్యతిరేకించాయి. దుబాయ్ నుంచి పాక్‌కు పర్యటించడం ఆటగాళ్లకు ఇబ్బందని పేర్కొన్నాయి. చివరకు బీసీసీఐ జోక్యంతో శ్రీలంక వేదికగా 9 మ్యాచ్‌లు, పాక్ వేదికగా నాలుగు మ్యాచ్‌లు నిర్వహించేందుకు అన్ని దేశాలు ఒప్పుకున్నాయి.
గతేడాది జరిగిన ఆసియాకప్ 2022 టోర్నీలో అనూహ్యంగా శ్రీలంక విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో అద్భుత విజయాన్నందుకుంది. ఆసియాకప్ 2023 లైవ్‌ను డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీగా చూపించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications