Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: రోహిత్ శర్మకు ఘోర అవమానం.. స్టార్ స్పోర్ట్స్ పోస్టర్‌లో నో ప్లేస్!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సోషల్ మీడియా వేదికగా ఘోర అవమానం ఎదురైంది. అప్‌కమింగ్ ఆసియాకప్ 2023 వన్డే టోర్నీ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో భారత కెప్టెన్ పేరు లేకపోవడం అతని అభిమానులను విస్మయపరిచింది.

ఈ నెల 30న ఆసియాకప్ ప్రారంభమవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ శనివారం స్టార్ స్పోర్ట్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టర్‌ను పంచుకుంది.

ఈ పోస్టర్‌లో ఆసియాకప్ నుంచి బరిలోకి దిగే కెప్టెన్లందరీ ఫొటోలు ఉండగా.. భారత్ నుంచి మాత్రం విరాట్ కోహ్లీ ఫొటో ఉంది. ఇదే రోహిత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫొటో కాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోను ఎలా ఉపయోగిస్తారంటూ హిట్ మ్యాన్ ఫ్యాన్స్.. స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

rohithsharma1

ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని మండిపడుతున్నారు. స్టార్ స్పోర్ట్స్‌కు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతో అతనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే బిజినెస్ వర్గాలు మాత్రం సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసేందుకు ఇలా చేసిందని అభిప్రాయపడుతున్నారు. విరాట్ కోహ్లీనే కాకుండా ఈ టోర్నీలో ఆడే ఇతర దేశాలకు సంబంధించి కూడా పాపులర్ ఆటగాళ్ల పేర్లనే ఈ పోస్టర్‌లో ఉంచిందని గుర్తు చేస్తున్నారు.

స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసిన పోస్టర్‌లో విరాట్ కోహ్లీతో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌, బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌, నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌‌ల ఫొటోలు ఉన్నాయి. పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 2న జరిగే మ్యాచ్‌కు సంబంధించిన పోస్టర్‌లో మాత్రం రోహిత్ శర్మ ఫొటో ఉండటం గమనార్హం.

శ్రీలంక వేదికగా ఈ నెల 30 నుంచి ఆసియాకప్ వన్డే టోర్నీ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంకతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.

Story first published: Saturday, August 5, 2023, 18:39 [IST]
Other articles published on Aug 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+