Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: యోయో టెస్ట్‌లో అతనే టాప్.. కోహ్లీ కాదు!

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్థార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని మించిపోయాడు. ఫిట్‌నెస్‌లో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లీనే శుభ్‌మన్ గిల్ ధాటేసాడు. ఆసియాకప్ 2023 కోసం టీమిండియా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్యాంప్‌లో ఫిట్‌నెస్ డ్రిల్స్‌తో పాటు ప్లేయర్లకు యోయో ఫిట్‌నెస్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తున్నారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం యోయో టెస్ట్‌లో అర్హత సాధించాలంటే 16.5 స్కోర్ నమోదు చేశాయి. గురువారం ఈ టెస్ట్‌కు హాజరైన కోహ్లీ తనకు 17.2 పాయింట్లు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు. యోయో టెస్ట్ అనంతరం తీసుకున్న సెల్ఫీని పంచుకున్నాడు.

Asia Cup 2023

శుక్రవారం ఇతర ఆటగాళ్లు యోయో టెస్ట్‌కు హాజరయ్యారు. ఇందులో శుభ్‌మన్ గిల్ జట్టులో ఉన్న అందరికంటే ఎక్కువగా 18.7 స్కోర్ చేశాడని ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు తన యోయో ఫిట్‌నెస్ టెస్ట్ స్కోర్‌ను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసిన విరాట్ కోహ్లీ.. బీసీసీఐ మందలించినట్లు వార్తలు వచ్చాయి. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను ఇలా బహిర్గతం చేయవద్దని విరాట్ కోహ్లీతో పాటు జట్టులోని ఆటగాళ్లందరిని హెచ్చరించినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

'సోషల్ మీడియా వేదికగా ఇలాంటి అధికారిక రహస్య విషయాలను వెల్లడించవద్దు. తమ శిక్షణ సందర్భంగా దిగిన ఫొటోలను కొందరు ఆటగాళ్లు అభిమానులతో పంచుకుంటున్నారు. అదేవిధంగా టెస్టుల స్కోరుకు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఇది బీసీసీఐ కాంట్రాక్ట్‌ క్లాజ్‌ ధిక్కరణ కిందకు వస్తుంది.

ఇలాంటివి చేయ వద్దని మౌఖింగా ఆదేశాలు ఇచ్చాం'అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. భారత పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, తిలక్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ మినహా మిగతా ఆటగాళ్లంతా ఇప్పటికే యోయో టెస్ట్ పూర్తిచేసినట్లు ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. ఆసియా కప్‌ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుండగా.. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఆడనుంది.

Story first published: Saturday, August 26, 2023, 10:12 [IST]
Other articles published on Aug 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+