Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. హింట్ ఇచ్చిన ద్రవిడ్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై నెలకొన్న అనుమానాలకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెరదించాడు. ఆసియాకప్ 2023 టోర్నీ ఈ ఇద్దరూ బరిలోకి దిగుతారని హింట్ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో చివరి టీ20 ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. ఆసియాకప్ 2023 ప్రిపరేషన్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆసియా కప్‌ 2023 ప్రారంభానికి ముందు బెంగళూరు వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ ఉంటుందని ద్రవిడ్ స్పష్టం చేశాడు. గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఈ క్యాంప్‌లో ఆసియా కప్‌ కోసం సన్నద్దం అవుతారని తెలిపాడు. 'గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చేందుకు మాకు కొంతమంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మేం వారికి ఆసియా కప్‌లో ఆడేలా అవకాశాలు ఇవ్వాలి.

Rahul Dravid Hints KL Rahul and Shreyas Iyer

ఆసియా కప్ కోసం ఆగస్టు 23 నుంచి బెంగళూరు వేదికగా వారం రోజుల పాటు ప్రాక్టీస్ క్యాంప్ ఉంది. రీఎంట్రీ ఇచ్చే ఆటగాళ్లకు ఈ ప్రాక్టీస్ క్యాంప్ ఉపయోగపడుతోంది. 'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా గాయాలపాలై కొంత కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బెంగళూరులోని ఎన్‌సీఏలో రీఎంట్రీ ఇచ్చేందుకు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

అయితే రాహుల్, అయ్యర్ ఫిట్‌‌గా లేరని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ ఆసియాకప్‌కు దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. ద్రవిడ్ మాత్రం వారు అందుబాటులోకి వచ్చారని తెలిపాడు. మరో రెండు రోజుల్లో ఆసియా కప్ 2023 బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించనున్నారు. ప్రపంచకప్ ముందు ఈ టోర్నీని సన్నదంగా వాడుకోనున్నారు.

Story first published: Monday, August 14, 2023, 22:14 [IST]
Other articles published on Aug 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+