హైదరాబాద్: ఆసియాకప్ 2023 టోర్నీలో హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపిన టీమిండియా మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక, పాకిస్థాన్ మరో బెర్త్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ఫైనల్‌కు చేరనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం మెరుగైన రన్ రేట్ ఉన్న శ్రీలంక టోర్నీలో ముందంజ వేస్తోంది. పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లాదేశ్ ఇప్పటికే ఇంటిదారి పట్టింది.

అయితే ఆసియాకప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ ఇప్పటి వరకు ఫైనల్లో తలపడలేదు. టీమిండియా 6 సార్లు టైటిల్ గెలిచినా.. పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచినా ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఈసారి గట్టిగా అనుకోండి.. అయిపోతుందని బదులిచ్చాడు.
మళ్లీ భారత్-పాక్ మ్యాచ్ జరగాలంటే.. శ్రీలంక ఓడిపోవాలి. ఇప్పటికే ఈ టోర్నీలో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. సూపర్-4 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 228 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది.
మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది.
రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు తీసాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.