Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023 హోస్ట్‌గా హాట్ యాంకర్..!

హైదరాబాద్: ఆసియాకప్ 2023 ప్రజెంటర్స్ జాబితాను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగబోయే ఈ మెగా టోర్నీకి ఐదుగురు ప్రజెంటర్స్‌ను స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసింది. ఈ వివరాలను ఆదివారం ప్రకటించింది. హాట్ యాంకర్స్ మయంతి లాంగర్‌, జైనాబ్ అబ్బాస్, జైతి ఖేరాతో పాటు జతిన్ సప్రు, తాన్య తివారీలకు అవకాశం కల్పించింది.

బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కోడలు అయిన మయంతి లాంగర్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె అందానికి కోట్లలో అభిమానులు ఉన్నారు. మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ సతమీణి అయిన మయంతి లాంగర్.. తనదైన వ్యాఖ్యానం‌తో హోస్ట్‌గా క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది. స్పోర్ట్స్ ప్రజెంటర్, స్టార్ స్పోర్ట్స్ యాంకర్‌గా ప్రీ , పోస్ట్ మ్యాచ్‌ షోలో తనదైన యాంకరింగ్‌తో ఓ రివల్యూషన్ తీసుకొచ్చింది.

 Asia Cup 2023

ప్రీ, పోస్ట్ మ్యాచ్‌ షోలకు మయంతి వల్లే ఆదరణ లభించింది. ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి తనకు ఇష్టమైన యాంకరింగ్‌తో పాటు అభిమానులకు మయంతి దూరమైంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2023తో మళ్లీ హోస్ట్‌గా పునరాగమనం చేసింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మయంతి చాలా సన్న బడింది.

గుర్తుపట్టలేనంత రీతిలో మారిపోయింది. బొద్దుగా ఉన్నప్పుడే మయంతి చాలా అందంగా ఉండేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 1985 ఫిబ్రవరి 8న ఢిల్లీలో జన్మించిన మయంతి స్థానిక హిందూ కాలేజీలో గ్యాడ్యూయేషన్‌ పూర్తి చేసింది. కాలేజీలో నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది. దీంతో పీజీ చేస్తుండగానే జీ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది.

తన యాంకరింగ్ చాలా మందికి నచ్చడంతో ఆమె కెరీర్‌ తారా జువ్వలా దూసుకుపోయింది. 2010లో ఫిఫా ప్రపంచకప్‌కి తొలిసారి వాఖ్యాతగా వ్యవహరించింది. అక్కడ విజయవంతం కావడంతో 2010లో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్‌ క్రీడలకు టీవీ ప్రెజెంటర్‌గా చేసింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్‌, ప్రపంచకప్‌లకు వ్యాఖ్యాతగా కొనసాగుతోంది. ఐపీఎల్‌లో బెస్ట్‌ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంది.

మ్యాచ్‌కు ముందు జరిగే విశ్లేషణలను చాలా మంది మయంతి కోసమే చూస్తారంటే అతిశయోక్తి కాదు. 2013లో క్రికెటర్‌ స్టువార్ట్‌ బిన్నిని వివాహం చేసుకున్న ఆమె.. వస్త్రధారణ విషయంలో తరుచూ ట్రోలింగ్‌కు గురయ్యేది.

Story first published: Sunday, August 20, 2023, 16:18 [IST]
Other articles published on Aug 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+