Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: పసికూన నేపాల్‌పై పాకిస్థాన్ ఘన విజయం!

ముల్తాన్: ఆసియాకప్ 2023‌లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. పసికూన నేపాల్‌తో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వన్డే చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద విజయం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది.

కెప్టెన్ బాబర్ ఆజామ్(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 151), ఇఫ్తికర్ అహ్మద్(71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. మహమ్మద్ రిజ్వాన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమీ రెండు వికెట్లు తీయగా.. కరణ్ కేసీ, సందీప్ లామిచ్చనే తలో వికెట్ పడగొట్టారు.

Pakistan thrash Nepal by 238 runs

అనంతరం లక్ష్యచేధనకు దిగిన నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. షాదాబ్ ఖాన్(4/27) నాలుగు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. షాహిన్ షా అఫ్రిది(2/27), హ్యారీస్ రౌఫ్(2/16), రెండేసి వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.

నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్(26), సోంపాల్ కమీ(28), గుల్సాన్ జా(13) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం విశేషం.

343 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన నేపాల్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. షాహిన్ షా అఫ్రిది నిప్పులు చెరగడంతో వరుస బంతుల్లో ఓపెనర్ కౌషల్ భుర్టెల్(8), కెప్టెన్ రోహిత్ పౌడెల్(0) పెవిలియన్ చేరారు.

ఆ వెంటనే నసీమ్ షా మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్(5)ను స్లిప్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. దాంతో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నేపాల్‌ను ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ ఆదుకునే ప్రయత్నం చేశారు.

పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. 63 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన ఈ జోడీని హ్యారీస్ రౌఫ్ విడదీసాడు. క్రీజులో సెట్ అయిన ఆరీఫ్ షేక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే సోంపల్ కమీ(28)ని కూడా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో నేపాల్ పతనం మొదలైంది.

షాదాబ్ ఖాన్ స్పిన్ బౌలింగ్‌తో చెలరేగడంతో క్రీజులోకి వచ్చిన గుల్సాన్ జా, దీపేంద్ర సింగ్(3), కుశాల్ మల్లా, సందీప్ లామిచ్చనే(0), లలిత్ రాజ్‌బాన్షి(0) వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో నేపాల్ 104 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. బాబర్ ఆజామ్, ఇఫ్తికర్ అహ్మద్ చేసిన పరుగులను కూడా నేపాల్ అధిగమించలేకపోయింది.

Story first published: Wednesday, August 30, 2023, 21:36 [IST]
Other articles published on Aug 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+