Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భీకర ఫామ్‌లో పాకిస్థాన్ బౌలర్లు.. రోహిత్ సేనకు దబిడి దిబిడే!

హైదరాబాద్: 'అఫ్గానిస్థాన్‌తో తొలి వన్డే‌లో పాకిస్థాన్ త్రయం హ్యారీస్ రౌఫ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది బౌలింగ్ ప్రదర్శన 1980లో వెస్టిండీస్ పేస్ బౌలింగ్‌ను తలపించింది.'పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ రమీజ్ రాజా చేసిన ట్వీట్. అతను అన్నట్లుగానే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పాక్ త్రయం సంధించిన బంతులకు అఫ్గానిస్థాన్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.

1980లో విండీస్ దిగ్గజ పేసర్లు మాల్కమ్ మార్షల్, జోయెల్ గార్నెర్, మైకేల్ హోల్డింగ్, యాండీ రాబర్ట్స్, కర్ట్‌నీ వాల్ష్, కర్ట్‌లీ ఆంబ్రోస్ బౌలింగ్ ఆడాలంటే బ్యాటర్లు వణికిపోయారు. మాల్కం మార్షల్ బంతి బ్యాటర్ ముక్కుముందునుంచి జోరీగ శబ్దం చేసుకుంటూ మెరుపులా దూసుకెళ్లేది. యాండీ రాబర్ట్స్ వేగం బంతికీ తూటాకూ తేడా చెరిపేసేదట.

Pakistan Cricket Team

ఆ తరహా బౌలింగ్‌నే గుర్తు చేస్తూ పాకిస్థాన్ బౌలర్లు చెలరేగారు. దాంతో అఫ్గానిస్థాన్ 59 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా హ్యారీస్ రౌఫ్ కళ్లు చెదిరే పేస్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతని పేస్‌‌కు స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ బిత్తరపోయాడు. బంతి వేగాన్ని అంచనా వేయలేకపోయిన రషీద్ ఖాన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

రెప్పపాటు సమయంలోనే బంతి తన బ్యాట్‌ను మిస్సై వికెట్లను తాకడంతో నోరెళ్లబెట్టాడు. స్వింగ్, షాట్ పిచ్, యార్కర్, వైడ్ యార్కర్‌లతో కూడిన వైవిధ్యమైన బౌలింగ్‌తో పాకిస్థాన్ పేసర్లు చెలరేగారు. తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

హ్యారీస్ రౌఫ్ 6 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసిస్తే.. నసీమ్ షా ఆరంభంలోనే వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసాడు. నసీమ్ షా ఒక్క వికెటే తీసినా.. తన పేస్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన షాహిన్ షా అఫ్రిది ఇందులో రెండో ఓవర్లు మెయిడిన్ చేయడంతో పాటు 2 వికెట్లతో 9 పరుగులే ఇచ్చాడు.

Haris Rauf

ఇందులో రెండు వైడ్సే ఉన్నాయి. షాహిన్ అఫ్రిదీ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు.నసీమ్ షా 5 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులివ్వగా.. హ్యారీస్ రౌఫ్ 6.2 ఓవర్లు వేసి 2 మెయిడిన్ చేశాడు. 18 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసాడు. పాకిస్థాన్ భీకర బౌలింగ్‌తో ప్రపంచకప్ ఆడే ప్రత్యర్థులకు చుక్కలే. ముఖ్యంగా ఆసియాకప్ 2023 టోర్నీ‌లో పాకిస్థాన్‌ బౌలర్లను భారత్ బ్యాటర్లను ఎలా ఎదుర్కొంటారా? అనేది చర్చనీయాంశమైంది.

సూపర్ ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్ బౌలర్లతో భారత బ్యాటర్లకు కష్టాలు తప్పవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వారి బౌలింగ్‌కు తగ్గట్లు టీమిండియా హోమ్ వర్క్ చేయాలని లేకుంటే భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిస్తున్నారు.

Story first published: Wednesday, August 23, 2023, 16:55 [IST]
Other articles published on Aug 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+