Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత బ్యాటర్లకు దబిడి దిబిడే!

కొలంబో: ఆసియాకప్ 2023‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న సూపర్ 4 మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో కొలంబోలోని ప్రేమదాసు స్టేడియం వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఈ మ్యాచ్‌ అయినా సజావుగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సూపర్-4 మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించారు.

వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే.. సోమవారం కొనసాగిస్తారు. అయితే కొలంబో వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఆదివారం 90 శాతం వర్షం వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్‌కు కచ్చితంగా అంతరాయం కలిగించనుంది. అయితే ఇదే వేదికపై శనివారం జరిగిన బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌ సజావుగా సాగింది. భారత్-పాక్ మ్యాచ్ కూడా జరుగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

India vs Pakistan, R Premadasa Stadium Pitch Report

ప్రస్తుతం కొలంబోలో ఎండ కొడుతోంది. ఉదయం చిన్నపాటి జల్లులతో కూడిన వర్షం పడినా.. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉంది. వాతావరణం ఇలానే ఉంటే మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగే అవకాశం ఉంది. ఇక కొలంబో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ వికెట్‌పై పాకిస్థాన్ పేసర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

కొలంబో పిచ్‌ బౌలర్లకు అనుకూలం. స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే ఇక్కడి పిచ్‌.. కొంతమేర పేసర్లకూ సహకరిస్తుంది. ఈ పిచ్‌పై పరుగులు చేయడం తేలిక కాదు. 250 లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే. ఆసియా కప్‌కు ముందు ఇక్కడ చివరి వన్డేలో పాక్‌ 268/8కు పరిమితం కాగా.. ఛేదనలో అఫ్గాన్‌ 208కే ఆలౌటైంది.

India vs Pakistan, R Premadasa Stadium Pitch Report

ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన బుమ్రాకు.. బౌలింగ్‌ చేసే అవకాశమే రాలేదు. తనకు కొడుకు పుట్టడం వల్ల నేపాల్‌తో మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ఈ సూపర్ మ్యాచ్‌కు అతను తిరిగి జట్టులోకి వస్తున్నాడు. బుమ్రా స్థానంలో ఆడిన సీనియర్‌ పేసర్‌ షమీ పెద్దగా ఆకట్టుకోలేదు. మరో పేసర్‌ శార్దూల్‌ ఇటీవలి ఫామ్‌ కూడా ఏమంత గొప్పగా లేని నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరు బుమ్రా కోసం తమ స్థానాన్ని త్యాగం చేస్తారో చూడాలి.

పిచ్‌ స్పిన్‌కు అనుకూలమన్న అంచనాలే నేపథ్యంలో ఈ ఇద్దరినీ కాదని.. జడేజా, కుల్‌దీప్‌లకు తోడుగా మూడో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌నూ దించే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్ కోసం ఎవర్ని పక్కనపెడతారో చూడాలి.

Story first published: Sunday, September 10, 2023, 10:52 [IST]
Other articles published on Sep 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+