Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలింగ్ చేసి బౌండరీ ఆపబోయిన సిరాజ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ, గిల్! (వీడియో)

కొలంబో: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సంచలన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ నిప్పులు చెరిగాడు. 16 బంతుల్లోనే 5 వికెట్లు తీసి అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. సిరాజ్ తన స్పెల్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసాడు.

అతని ధాటికి శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఓవర్‌లో సిరాజ్ చేసిన పని నవ్వులు పూయించింది. ఈ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ పాతుమ్ నిస్సంక(2) జడేజా సంచలన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.

Asia Cup 2023 Final: బౌండరీ ఆపబోయిన సిరాజ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ, గిల్!

బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో జడేజా సూపర్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమరవిక్రమా మరుసటి బంతిని డాట్ చేసి మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ మరుసటి బంతికి గత మ్యాచ్ విన్నర్ చరిత్ అస్సలంక(0) డకౌటయ్యాడు. సిరాజ్ వేసిన ఫుల్‌ డెలివరీని అసలంక డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా కవర్స్‌లో ఉన్న కిషన్ చేతిలో పడింది.

అనంతరం ధనంజయ డిసిల్వా(4) నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. అయితే ఈ బంతి వేసిన వెంటనే సిరాజ్.. ధనంజయ్ డిసిల్వా ఆడిన బౌండరీ ఆపేందుకు పరుగెత్తాడు. సిరాజ్ వేసిన స్ట్రైట్ డెలివరీని ధనంజయ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడ ఫీల్డర్లు లేకపోవడంతో బంతిని ఆపేందుకు సిరాజ్ బౌండరీ లైన్ వరకు పరుగెత్తాడు.

ఇది చూసిన భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ ముసి ముసి నవ్వుకున్నారు. వికెట్లు రాగానే సిరాజ్.. మంచి జోష్‌లో ఉన్నాడని సెటైర్లు పేల్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. సిరాజ్ కమిట్‌మెంట్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఆ మరుసటి బంతిని సిరాజ్ ఔట్ స్వింగర్‌గా వేయగా ధనంజయ.. పుష్ చేసే ప్రయత్నంలో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో ఒకే ఓవర్‌లో సిరాజ్ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్‌గా సిరాజ్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు.

తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్ డసన్ షనక(0)ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అత్యంత వేగంగా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అనంతరం కుశాల్ మెండీస్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ ఆరో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే వెల్లలాగే(8)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేయడంతో శ్రీలంక 40 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

Story first published: Sunday, September 17, 2023, 17:05 [IST]
Other articles published on Sep 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+