Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023 Final: రోహిత్ శర్మతో తెలుగు స్టార్ హీరో..!

కొలంబో: ఆసియా కప్ 2023‌ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. శ్రీలంక-భారత్ మధ్య కొలంబో వేదికగా ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా మొదలవ్వలేదు. ప్రస్తుతానికి వర్షం ఆగిపోగా.. గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్దం చేస్తున్నారు. పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు 3.45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

ఇక ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు టాలీవుడ్ టాప్ హీరో, విక్టరీ వెంకటేశ్ బెస్ట్ విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. 'బ్లూ జెర్సీలో ఉన్న మా అబ్బాయిలందరికీ ఆల్‌ద బెస్ట్. ఫైనల్లో గెలిచి కప్‌ను తీసుకురండి కెప్టెన్ రోహిత్'అని పేర్కొన్నాడు.

Asia Cup 2023 Final: రోహిత్ శర్మతో తెలుగు స్టార్ హీరో..!

వెంకటేష్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ తరపున వెంకీ ఆడాడు. అంతేకాకుండా జట్టు కెప్టెన్, మెంటార్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే వెంకీమామా కచ్చితంగా చూడటానికి వెళ్తాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచులో విశ్రాంతి తీసుకున్న ఐదుగురు కీలక ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారని రోహిత్ వెల్లడించాడు. అలాగే అక్షర్ గాయంతో మ్యాచ్‌కు దూరమైనట్లు చెప్పాడు. దీంతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నట్లు ప్రకటించాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లాలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మధుషన్, మతీషా పతీరణ

Story first published: Sunday, September 17, 2023, 16:10 [IST]
Other articles published on Sep 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+