Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023 Final: చరిత్ర సృష్టించిన మహమ్మద్ సిరాజ్..!

కొలంబో: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సంచలన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ నిప్పులు చెరిగాడు. 16 బంతుల్లోనే 5 వికెట్లు తీసి అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ బౌలర్ చమిందా వాస్ రికార్డును సమం చేశాడు.

2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చమింద వాస్ 16 బంతుల్లోనే 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్ ఉస్మాన్ ఖవాజా 21 బంతుల్లో ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా ఈ ఘనతను అందుకున్నాడు. నెదర్లాండ్స్ బౌలర్ టీమ్ వాన్ డెర్ 2013లో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టాడు.

Asia Cup 2023 Final: Mohammed siraj creates World record

తొలి 10 ఓవర్లలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్‌గా సిరాజ్ చరిత్రకెక్కాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా కూడా సిరాజ్ చరిత్ర సృష్టించాడు. 1002 బంతుల వ్యవధిలోనే సిరాజ్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్‌గా సిరాజ్ రికార్డు నమోదు చేశాడు. ఆసియాకప్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను సిరాజ్ కనబర్చాడు. అతని ధాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది.

సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ పాతుమ్ నిస్సంక(2) జడేజా సంచలన క్యాచ్‌తో పెవిలియన్ చేరగా... మూడో బంతికి సమరవిక్రమా ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. నాలుగో బంతికి గత మ్యాచ్ విన్నర్ చరిత్ అస్సలంక(0) డకౌటయ్యాడు. సిరాజ్ వేసిన ఫుల్‌ డెలివరీని అసలంక డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా కవర్స్‌లో ఉన్న కిషన్ చేతిలో పడింది.

అనంతరం ధనంజయ డిసిల్వా(4) నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. కానీ మరుసటి బంతికే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ వేసిన ఔట్ స్వింగర్‌‌ను పుష్ చేసే ప్రయత్నంలో కీపర్‌కు చిక్కాడు. దాంతో ఒకే ఓవర్‌లో సిరాజ్ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్ డసన్ షనక(0)ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అత్యంత వేగంగా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అనంతరం కుశాల్ మెండీస్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ ఆరో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.

చివరి మూడు వికెట్లను హార్దిక్ పాండ్యా తీయడంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. వెల్లలాగే(8), ప్రమోద్(1), పతీరణ(0)లను వరుసగా పెవిలియన్ చేర్చాడు.

Story first published: Sunday, September 17, 2023, 17:50 [IST]
Other articles published on Sep 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+