న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌కు ఆసియాకప్‌లో బాగా సన్నద్ధం కావొచ్చని, బలబలాలను పరీక్షించుకోవచ్చని, తుది జట్టుపై ఓ అవగాహనకు రావచ్చని భావించిన జట్ల ఆశలపై వరణుడు నీళ్లు జల్లుతున్నారు. శ్రీలంక భారీ వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగా మారింది. ఇప్పటికే లీగ్ దశలో ఓ మ్యాచ్ రద్దవ్వగా.. మరో రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది.
కొలంబో వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లకు కూడా వర్ష ముప్పు పొంచి ఉంది. రుతుపవనాల ఆలస్యం కారణంగా గత రెండు వారాలుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రోజుల్లోనూ వాన కురుస్తుందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే అంశం ఏంటంటే.. భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగే సూపర్-4 మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది.

ఆ రోజంతా 75 శాతం వాన పడే అవకాశం ఉంది. మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఈ ఒక్క మ్యాచే కాదు ఫైనల్‌తో సహా సూపర్ 4 మ్యాచ్‌లన్నీ ఇక్కడే జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నిటీకి వర్షం ముప్పు పొంచి ఉంది. అంటే మొత్తం టోర్నీనే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం నెలకొంది.
బీసీసీఐ పంతం కారణంగా ఆసియాకప్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు సెప్టెంబరులో శ్రీలంకలో ఆసియాకప్ నిర్వహించడమే సరికాదని అంటున్నారు. అయితే ప్రపంచకప్ సన్నద్దం కోసం ఆసియాకప్‌ను శ్రీలంకకు మార్చారని, ఇక్కడ పరిస్థితులు భారత్‌కు దగ్గరగా ఉంటాయని ఓ మాజీ క్రికెటర్ తెలిపారు.
వాస్తవానికి ఆసియాకప్ వేదిక పాకిస్థాన్ అయినా.. భారత్ ఆ దేశానికి జట్టును పంపడానికి తిరస్కరించింది. ముందు టోర్నీ మొత్తాన్ని తామే నిర్వహిస్తామని పట్టుబట్టిన పాక్, ఆ తర్వాత తాము ఆతిథ్యమిచ్చే కొన్ని మ్యాచ్‌లు కాకుండా.. మిగతా మ్యాచ్‌లను యూఏఈలోనైనా నిర్వహించాలని కోరింది. కానీ అందుకు కూడా బీసీసీఐ ఒప్పుకోలేదు.
తాను కోరుకున్నట్లు ఎక్కువ మ్యాచ్‌లు లంకలో జరిగేలా చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ అధికారులు ఇప్పుడు భారత్‌పై మండిపడుతున్నారు. తమకు తీవ్ర నష్టం ఏర్పడిందని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు వర్షాల నేపథ్యంలో సూపర్-4 మ్యాచ్‌ల వేదికను హంబన్‌టోటకు మార్చాలని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ప్రతిపాదించినప్పటికీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఒప్పుకోలేదు. ఇంత తక్కువ వ్యవధిలో సామగ్రి, సిబ్బందిని అక్కడికి తరలించడం చాలా కష్టమని అధికారిక బ్రాడ్‌కాస్టర్ చెప్పడమే అందుకు కారణమని తెలుస్తోంది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందని జరిగిన ప్రచారంలో కూడా వాస్తవం లేదు. ఈ ఒక్క మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయిస్తే మిగతా అన్నీ మ్యాచ్‌లకు పెట్టాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదని ఏసీసీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.