For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2023: అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం!

లాహోర్: ఆసియాకప్ 2023లో బంగ్లాదేశ్ బోణీ చేసింది. సూపర్-4 చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 89 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. మెహ్‌దీ హసన్ మిరాజ్(119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112), నజ్ముల్ హొస్సెన్ షాంటో(105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 104) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరికి తోడుగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

 Bangladesh Beat Afghanistan

అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, గల్బాదిన్ నైబ్ తలో వికెట్ తీసారు. రషీద్ ఖాన్(0/66) దారుణంగా విఫలమయ్యాడు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 44.3 ఓవర్లలో 245 పరుగులకు కుప్పకూలింది. ఇబ్రహీమ్ జడ్రాన్(74 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75), హష్మతుల్లా షాహిది(60 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.

బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్(4/44) నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. షోరిఫుల్ ఇస్లామ్(3/36) మూడు వికెట్లతో సత్తా చాటాడు. హసన్ మహముద్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెహ్‌దీ హసన్ మీరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

బంగ్లాదేశ్ విజయంతో గ్రూప్-బీ సూపర్ 4 క్వాలిఫికేషన్ సంక్లిష్టంగా మారింది. శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య జరిగే తదుపరి మ్యాచ్‌పై బంగ్లాదేశ్ సూపర్ 4 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధిస్తే అఫ్గానిస్థాన్ ఇంటిదారి పడుతుంది. ఒకవేళ అఫ్గాన్ విజయం సాధిస్తే మూడు జట్లలో మెరుగైన రన్ రేట్ ఉన్న రెండు జట్లు టోర్నీలో ముందంజ వేస్తాయి.

గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ -4 చేరగా.. సోమవారం భారత్-జపాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం ఆధారంగా రెండో జట్టు ఏదో తేలనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే టీమిండియా ఇంటిదారిపడుతోంది.

Story first published: Sunday, September 3, 2023, 23:26 [IST]
Other articles published on Sep 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+