For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2023: తెలుగోడికి గోల్డెన్ ఛాన్స్!

ముంబై: తంతే బూరెల బుట్టలో పడినట్లుంది టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ పరిస్థితి. గతేడాదే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై కుర్రాడు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడంతో పాటు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు.

ఆగస్ట్ 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియాకప్ 2023 టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో తిలక్ వర్మకు అవకాశం దక్కింది. వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తిలక్ వర్మ.. ఐదు టీ20ల సిరీస్‌లో అసాధారణ ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Tilak Varma

జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరణితితో ఆడి అందరి ప్రశంసలు అందుకున్నాడు. లెఫ్టాండర్ కావడంతో పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో టీమిండియా నాలుగో స్థానానికి తిలక్ వర్మ సరిగ్గా సరిపోతాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అండర్ 19 టీమ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తిలక్ వర్మ ఆటను దగ్గరగా చూడటంతో అతనిపై ఉన్న నమ్మకంతో ఆసియాకప్‌కు ఎంపి చేశారు.

ఆసియాకప్‌లో అతను మెరుగ్గా రాణిస్తే.. ప్రపంచకప్ జట్టులోనూ కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.'తిలక్ వర్మ అసాధారణమైన ఆటగాడు. అతను వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైతే ఏషియన్ గేమ్స్ జట్టు నుంచి తప్పుకుంటాడు. ఆసియాకప్ అతనికి గొప్ప అవకాశం. లెఫ్టాండర్ కావడం అతనికి అదనపు బలం. మెరుగ్గా రాణిస్తే ప్రపంచకప్ జట్టులో కొనసాగుతాడు.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్‌లో రాణిస్తే వన్డే ప్రపంచకప్ జట్టులో కొనసాగుతాడని పరోక్షంగా వెల్లడించాడు.

Ajit Agarkar

ఇక తిలక్ వర్మను టీమిండియాలోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు రవి శాస్త్రి, సౌరవ్ గంగూలీ, వసీం జాఫర్‌లు అభిప్రాయపడ్డారు. అతన్ని నాలుగో స్థానంలో ఆడిస్తే జట్టుకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లభిస్తోందని చెప్పాడు. వెస్టిండీస్ పర్యటనలో అతని ఆట అసాధారణంగా ఉందని కొనియాడారు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతను బ్యాటింగ్ చేసిన విధానం ఆకట్టుకుందని చెప్పారు.

ఆసియాకప్ 2023లోనూ తిలక్ వర్మ సత్తా చాటితే వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం అందుకోవడంతో పాటు రెగ్యులర్ ప్లేయర్‌గా ఎదుగనున్నాడు. సంజూ శాంసన్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికి చేసిన భారత సెలెక్షన్ కమిటీ.. యుజ్వేంద్ర చాహల్‌పై వేటు వేసింది. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు కూడా జట్టులోకి వచ్చారు.

ఆసియాకప్ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టు:

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

స్టాండ్‌బై ప్లేయర్: సంజూ శాంసన్

Story first published: Monday, August 21, 2023, 16:14 [IST]
Other articles published on Aug 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+