For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2023: విరాట్ విధ్వంసం.. సచిన్ 100వ సెంచరీ.. ఆ 4 మ్యాచ్‌లు సూపరో సూపర్!

హైదరాబాద్: ఆసియాకప్ 2023 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో 12 రోజుల్లో ఈ మినీ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియాకప్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆసియా దేశాలన్నీ సన్నాహకాలు ప్రారంభించాయి. ఆగస్ట్ 23 నుంచి టీమిండియా బెంగళూరు వేదికగా ప్రాక్టీస్ క్యాంప్‌ నిర్వహించనుంది.

ఈ టోర్నీ ముగిసిన వెంటనే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో ఆసియా దేశాలన్నీ... ఆసియాకప్‌ను సన్నాహకంగా వాడుకోనున్నాయి. ఇప్పటికే ఆసియాకప్‌కు సంబంధించిన బజ్‌మొదలైంది. 39 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియాకప్‌లో ఎన్నో మ్యాచ్‌లు అభిమానుల మనసులను దోచుకున్నాయి. ముఖ్యంగా ఓ ఐదు మ్యాచ్‌లు ఇప్పటికీ మోస్ట్ మెమోరబుల్‌గా నిలిచిపోయాయి. వాటిపై ఓ లుక్కెద్దాం.

Asia Cup 2023:

1. విరాట్ కోహ్లీ విధ్వంసం..
పాకిస్థాన్‌తో 2012లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 183 పరుగులు చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యచేధనలో గౌతమ్ గంభీర్ డకౌటవ్వగా.. సచిన్‌తో కలిసి కోహ్లీ చెలరేగాడు. అసాధారణ బ్యాటింగ్‌తో మరిచిపోలేని విజయాన్నందించాడు.
Asia Cup 2023:

2. సచిన్ 100వ సెంచరీ..
ఆసియాకప్‌ 2012లో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులతో సచిన్ సత్తా చాటాడు. కానీ ఇతర బ్యాటర్లు విఫలమవడంతో టీమిండియా 289 పరుగులకే పరిమితమైంది. అనంతరం బంగ్లాదేశ్ అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌ను ఓడించింది. సచిన్ 100 సెంచరీ రికార్డు‌తో పాటు భారత్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించడంతో ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది.

Asia Cup 2023:

3. ఆఖరి బంతికి సిక్స్..
భారత్‌తో జరిగిన 1986 ఆసియాకప్‌ ఫైనల్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ జావెద్ మియాందాద్ ఆఖరి బంతికి సిక్స్‌ బాది విజయాన్నందించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 236 పరుగులే చేసింది. సునీల్ గవాస్కర్ 92 పరుగులతో రాణించగా.. దిలిప్ వెంగ్‌సర్కార్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్యచేధనలో భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ తడబడింది. కానీ టెర్రరిస్ట్ దావుద్ ఇబ్రహీం బామ్మర్ది అయిన జావెద్ మియాందాద్ అసాధారణ బ్యాటింగ్‌తో కడవరకు పోరాడాడు. ఆఖరి ఓవర్ చివరి బంతిని చేతన్ శర్మ ఫుల్‌‌ టాస్‌గా వేయగా.. జావెద్ మియాందాద్ సిక్స్ బాది సంచలన విజయాన్నందించాడు.

Asia Cup 2023:

4. బంగ్లాదేశ్‌పై ఆఖరి బంతికి విజయం
ఆసియాకప్ 2018 ఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 222 పరుగులు చేసింది. లిటన్ దాస్(121) సెంచరీతో చెలరేగాడు. లక్ష్యచేధనలో రోహిత్ శర్మ చెలరేగడంతో శుభారంభం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరకు కేదార్ జాదవ్(23 నాటౌట్) విరోచిత బ్యాటింగ్‌తో ఆఖరి బంతికి గెలిచింది.

Story first published: Friday, August 18, 2023, 18:08 [IST]
Other articles published on Aug 18, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+