For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Pakistan:కొంపముంచిన కోహ్లీ కెప్టెన్సీ.. అభిమానులను వెంటాడుతున్న ఆ ఆసియాకప్ పరాభవం!

 Asia Cup 2022: When Shahid Afridi powered Pakistan to last over win against India

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న భారత్Xపాక్ సమరానికి రంగం సిద్దమైంది. మరో 72 గంటల్లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఆసియాకప్ 2022 టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం దాయదీల పోరు అభిమానులను కనువిందు చేయనుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడంతో పాటు ఐసీసీ, ఆసియాకప్ వంటి మేజర్ టోర్నీల్లో ఇరు దేశాలు తలపడుతుండటంతో దాయాదులపై పోరు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మెగా టోర్నీల మాదిరే ఆసియాకప్‌లోనూ పాక్‌పై భారత జట్టుదే పూర్తి ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఇరు జట్లు 14 సార్లు తలపడగా.. 8 సార్లు భారత్ విజయం సాధించగా.. పాక్ ఐదు సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం తేలలేదు.

2014 పరాజయం..

2014 పరాజయం..

అయితే 14 ఏళ్ల ఆసియాకప్‌లో 2014 ఎడిషన్‌లో భారత్ ఘోర పరాభావాన్ని ఎదుర్కొంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. పాకిస్థాన్ చేతిలో గెలిచే మ్యాచ్‌ను కోహ్లీ చెత్త కెప్టెన్సీ కారణంగా చేజార్చుకుంది. ఆసియా కప్ చరిత్రలో గత ఆరు మ్యాచుల్లో పాక్ చేతుల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా.. అది 2014 సీజన్‌లోనే కావడం గమనార్హం. 2014 ఆసియా కప్ ఆరంభానికి ముందు గాయపడిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఫలితంగా విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. పేలవ ఫామ్ కారణంగా యువరాజ్, సురేశ్ రైనాలు ఈ టోర్నీకి ఎంపికవ్వలేదు. వీరి స్థానంలో అజింక్యా రహానే, దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు వంటి ప్లేయర్లకు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం దక్కింది.

రోహిత్, రాయుడు మినహా..

రోహిత్, రాయుడు మినహా..

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 245 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. రోహిత్ శర్మ (58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), అంబటి రాయుడు (62 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58), రవీంద్ర జడేజా (49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శిఖర్ ధావన్(10), విరాట్ కోహ్లీ (5), అజింక్యా రహానే (23), దినేశ్ కార్తీక్( 23), రవిచంద్రన్ అశ్విన్( 9) దారుణంగా విఫలమయ్యారు.

ఉత్కంఠగా సాగి..

ఉత్కంఠగా సాగి..

అనంతరం సాధారణ లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు ఓపెనర్లు షార్జీన్ ఖాన్, అహ్మద్ షాజద్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్ల చెలరేగడంతో పాక్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు మహ్మద్ హఫీజ్ (117 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 75) ఒంటరి పోరాటం చేశాడు. చివరకు హఫీజ్ ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 36 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయిన పాక్... ఆఖరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు చేయాల్సి వచ్చింది.

అప్పటికే ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా తమ10 ఓవర్ల కోటాను పూర్తి చేసుకున్నారు. దీంతో మరో ఆప్షన్ లేక విరాట్ కోహ్లీ... బంతిని అశ్విన్‌కు అందించాడు.

 కోహ్లీ తప్పిదంతో..

కోహ్లీ తప్పిదంతో..

తొలి బంతికే అశ్విన్.. సయ్యద్ అజ్మల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత శిభిరంలో చిరునవ్వులు విరబూసాయి. కానీ తర్వాతి బంతికి సింగిల్ తీసిన జునైద్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదికి స్ట్రైయిక్ ఇచ్చాడు. విధ్వంసకర బ్యాటర్లలో ఒకడైన షాహిదీ ఆఫ్రిదీ... రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించేశాడు. ఒక్కసారిగా యావత్ భారత్ మూగబోయింది. ఈ ఊహించని పరాజయాన్ని తట్టుకోలేకపోయింది. స్పిన్నర్‌‌ అశ్విన్‌తో మిగిలిన ఓవర్ ముందుగానే వేయించి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీల్లో ఒకరికి ఆఖరి ఓవర్ ఇచ్చి ఉంటే ఫలితం వేరేగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

Story first published: Thursday, August 25, 2022, 15:59 [IST]
Other articles published on Aug 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+